దేశంలో అసలు ఎన్నికల సంఘం ఉందా..?: చంద్రబాబు

దేశంలో ఎన్నికల సంఘం పనితీరే అనుమానాస్పదంగా ఉందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. నిబంధనల ప్రకారం…2 గంటలకుపైగా పోలింగ్‌ ఆలస్యమైతే రీపోలింగ్‌ జరపాల్సి ఉందన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయలేదని ఈసీ కూడా ఒప్పుకుందని.. ఈసీ వైఫల్యాలకు ప్రజల్ని ఇబ్బంది పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేసి సింపుల్‌గా సారీ చెప్పేశారని.. ఏపీలో 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్ర చేశారని మండిపడ్డారు. కుట్రను సకాలంలో బయటపెట్టి మేం సిట్‌ ఏర్పాటు చేస్తే.. కనీసం ఐపీ అడ్రస్‌లు కూడా ఇవ్వకుండా ఈసీ తాత్సారం చేసిందని విమర్శించారు. ఇలాంటి చర్యలను ఈసీ ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ఏపీ మీద జరిగిన కుట్రలకు ఈసీ సహకరించిందని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి ఈవీఎంలు పనిచేయలేదు .. అదే సమయంలో వైసీపీ హింస మొదలుపెట్టిందన్నారు. అంత బీభత్సం చేసిన వాళ్లు ఇప్పుడు గవర్నర్‌ దగ్గరకు వెళ్లి… ఫిర్యాదులు చేస్తున్నారు, నటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయాల కోసం సొంత బాబాయ్‌ని చంపి అరాచకం చేశారని .. దానిపై మేం మాట్లాడకూడదంటూ ఒత్తిడి తెచ్చి ఆదేశాలు ఇప్పించారన్నారు. ఇదంతా ఉల్లంఘనలో భాగమేనని .. దొంగల్ని రక్షించే ఉద్దేశంతోనే ఐపీ అడ్రస్‌లు ఇవ్వలేదన్నారు. ఈసీ దొంగల్ని రక్షిస్తే ఇక న్యాయం ఎలా జరుగుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. వీవీప్యాట్‌లను లెక్కించమంటే కుదరదంటున్నారు.. వీవీప్యాట్‌లు ఎందుకు పెట్టారు.. అలంకారం కోసమా? అని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎన్నికల కమిషన్‌ ఉందా? అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎప్పుడైనా ఇంత డబ్బు ఖర్చుపెట్టారా?…అని చంద్రబాబు ఈసీని ప్రశఅనించారు. రాజ్యంగ సంస్థలను మోదీ భ్రష్టుపట్టించి.. దేశాన్ని దోపిడీ చేసి విదేశాలకు పారిపోతున్నవారికి మోదీ కాపలాదారుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రో ధరలు…రూపాయి విలువ ఇవన్నీ మోదీ వైఫల్యాలన్నారు. వీవీప్యాట్‌లు లెక్కించమంటే ఎందుకు భయపడుతున్నారని.. ఫ్రాడ్‌ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లే కదా భయపడేదని చంద్రబాబు ప్రస్నించారు. పోలైన ఓట్లకు అసలు ఉన్న ఓట్లకు తేడాలు ఎందుకొస్తున్నాయి.. బ్యాలెట్‌ అయితే అలా జరిగి ఉండేదా? అని చంద్రబాబు ప్రశఅనించారు. ఈ దేశాన్ని మేము ఏమైనా చేస్తాం అన్నట్లుగా… అహంకారంతో వ్యవహరిస్తున్నవారిని తిప్పికొట్టాలంటే…దేశంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలోని మేధావులు, విద్యార్థులు స్పందించాలని … వీవీప్యాట్‌లను లెక్కించమంటే అభ్యంతరం ఏమిటనన్నారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కేసులు ఉన్నాయని.. అంటే.. హైదరాబాద్ లో కూర్చున్న రిటైర్డ్ అధికారులు గవర్నర్ కు ఫిర్యాదు చేయడంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఏపీలో అధికారులను బదిలీ చేస్తే.. రిటైర్డ్‌ ఐఏఎస్‌లు ఎందుకు మాట్లాడలేదనన్నారు. ఉన్నమాట అంటే మాజీ బ్యూరోక్రాట్‌లు నాపై ఫిర్యాదు చేయడం ఏమిటన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం మీద కేసులు లేవా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏకపక్షంగా అలాంటి వ్యక్తిని ఎలా సీఎస్‌ను చేస్తారు?…అందుకే ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్‌ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పోలింగ్ రోజు సాయంత్రం ఐదారు గంటలంటే..ఎంత కీలకం అని.. అలాంటి సమయంలో మొక్కలు నాటడానికి డీజీపీ ఆఫీస్‌కు సీఎస్ వెళ్తారా అని చంద్రబాబు ఆశ్చర్యంవ్యక్తం చేశారు. డీజీతో సీఎస్‌ అప్పుడు సమావేశం కావాల్సిన అవసరం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలు రాష్ట్ర పాలనను కేంద్రం చేతుల్లో పెట్టాలని చూస్తున్నారని… పోలింగ్ అవ్వగానే విహారయాత్రకు వెళ్తున్న జగన్.. ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com