హైకోర్టు విభజనతో మళ్లీ మొదటికి జగన్ కేసుల విచారణ..! కొత్త కోణం వెల్లడించిన చంద్రబాబు..!!

హైకోర్టు విభజన తో జగన్ కేసుల పై ప్రభావం పడుతుందా..?. సీబీఐ కోర్టుకు హైకోర్టుకు సంబంధం ఏముంది..? సీబీఐ కోర్టు.. సీబీఐ కోర్టే కదా.. అని అందరికీ అనిపించవచ్చు. కానీ హైకోర్టుతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన విషయంలోనూ కేంద్రం సంప్రదింపులు జరపలేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. సమయం ఇవ్వకుండా జనవరి1 కల్లా వెళ్లిపోవాలి అనడం సరికాదన్నారు. ఇలా ఎందుకు చేశారన్నదానిపై చంద్రబాబు భిన్నమైన విశ్లేషణ చేశారు. హైకోర్టు విభజనతో నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల జగన్‌ కేసులకు సంబంధించిన విచారణ మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని… ఆ దృష్టితో కూడా విభజన చేసినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని… ఇప్పుడా ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సిందేనన్నారు. జగన్‌ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందని గుర్తు చేశారు.

హైకోర్టు విభజన వ్యవహారం మొత్తం ఇప్పటి వరకూ ఒక వైపు అందరూ చూశారు. చంద్రబాబు మాత్రం… రెండో వైపు చూశారు. హైకోర్టు పరిధిలోని న్యాయాధికారులను కూడా బదిలీ చేశారు. ఈ క్రమంలో… నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని చంద్రబాబు చెబుతున్నారు. అంటే.. చంద్రబాబు చెప్పనట్లు… నిజంగానే జగన్ కేసులు మొదటి నుంచి మళ్లీ విచారణ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ కేసు విషయంలో ఇప్పటికే వివిధ కారణాల రీత్యా చాలా ఆలస్యం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఈడీ దూకుడుగా వ్యవహరించి.. కొన్ని ఆస్తులు జప్తు చేసినప్పటికీ.. ఆ తర్వాత బీజేపీతో వైసీపీ సన్నిహిత సంబంధాలు ఏర్పడిన తర్వాత నెమ్మదించిందనే విమర్శలు టీడీపీ వైపు నుంచి చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఈడీ అటాచ్ చేసిన కొన్ని ఆస్తులను కేంద్రం ప్రత్యేక ఆదేశాల ద్వారా విడిపించిందని సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే అసెంబ్లీలో బయటపెట్టారు.

హైకోర్టు విభజన అనివార్యమే అయితే.. రాష్ట్రపతి నోటిఫికేషన్ తర్వాత కనీసం మూడు నెలల గడువు ఇవ్వడం ఆనవాయితీ. ఈ సారి అలాంటి ప్రస్తావనే లేదు. ఐదు రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఒకటో తేదీ నుంచి ఏపీలో హైకోర్టు ప్రారంభించాలని ఆదేశాలిచ్చారు. కేసీఆర్ ప్రధానితో భేటీ అయిన అరగంటలోనే ఈ గెజిట్ విడుదల కావడంపై.. అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తం అయంది. ఈ తరుణంలో చంద్రబాబు.. జగన్ కేసుల కోణాన్ని బయటపెట్టడం కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close