కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు స్పంద‌న ఇదీ..!

తాను మూడో క‌న్ను తెరిస్తే నీ గ‌తి ఏమౌతుందో తెలుసుకో అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని ఉద్దేశించి తెరాస అధినేత కేసీఆర్ న‌ల్గొండ స‌భ‌లో తీవ్రంగా విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు రోజు నిజామాబాద్ స‌భ‌లో కూడా ఇదే త‌ర‌హాలో ఏపీ సీఎం చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకునే మండిప‌డ్డారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు స్పందించారు. తాను నాలుగు ద‌శాబ్దాలుగా హుందాగా రాజ‌కీయాలు చేస్తున్నాన‌నీ, ప‌రుష ప‌ద‌జాలం వాడ‌టం త‌న వ్య‌క్తిత్వం కాద‌న్నారు చంద్ర‌బాబు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ‌లో కార్న‌ర్ చెయ్యాల‌న్న‌దే కేసీఆర్ ఉద్దేశం అన్నారు. వైకాపా, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కేసీఆర్ లు భాజ‌పాతో క‌లిసి ఉన్నార‌నీ, బ‌య‌ట‌కి ఎందుకీ నాట‌కాల‌న్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని తెరాస కూడా చెప్పింద‌నీ, అయితే తాను భాజ‌పాతో తెగ‌తెంపులు చేసుకోగానే ఒకేసారిగా మాట మార్చారనీ, ఆ తరువాత ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని ప్రశ్నించారు. త‌న గురించి అంత‌గా తిట్టాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌నీ, తాను చేసిన త‌ప్పేంట‌నీ, హైద‌రాబాద్ అభివృద్ధి చెయ్య‌డం త‌ప్పుగా క‌నిపిస్తోందా, బాబ్లీపై పోరాటం త‌న త‌ప్పా, రాత్రింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డి కృషి చేయ‌డం త‌న త‌ప్పా అని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భాజ‌పా ద‌ర్శ‌క‌త్వంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌పై మాట‌ల దాడి చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు? తాను చేసిన త‌ప్పేంటో తెలుగువారంతా ఒక్క‌సారి ఆలోచించాల్సిన అవ‌స‌రముందున్నారు. వారు స‌మాయానికో ర‌కంగా మీరు మాట మారుస్తూ వ‌స్తున్నార‌నీ, తాను మొద‌ట్నుంచీ ఒకే మాట మాట్లాడుతున్నా అన్నారు.

ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌త ఉంద‌నీ, రెండు రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు దీనిపై ఆలోచించి నిర్ణ‌యం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాను ఏ సంద‌ర్భంలోనూ ప‌రుష ప‌ద‌జాలం వాడ‌న‌నీ, అది త‌న స‌భ్య‌త కాద‌నీ, ఉద్య‌మ స‌మ‌యంలో కూడా సంయ‌మ‌నంతో ఉండ‌టం ప్ర‌జ‌లంతా చూశార‌న్నారు. మొత్తానికి, కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఘాటుగానే స్పందించారు సీఎం చంద్ర‌బాబు. నిజానికి, తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అనే స్థాయిలో కేసీఆర్ లో విమ‌ర్శ‌లు ఉంటూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక‌, న‌ల్గొండ స‌భ‌లో విష‌యానికొస్తే… కేసీఆర్ మ‌రింత డోస్ పెంచి విమ‌ర్శ‌లు చేశారు. దీని వెన‌కున్న వ్యూహం కూడా అర్థ‌మౌతూనే ఉంది. న‌ల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌, టీడీపీలు క‌లిస్తే… తెరాస‌కు ఎదురీత త‌ప్ప‌ద‌నే వాతావ‌ర‌ణం ఉంది కాబ‌ట్టే… ఈ త‌ర‌హాలో సెంటిమెంట్ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేశార‌నే విశ్లేష‌ణ‌లూ వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close