చంద్రబాబు చెప్పిన ఎలుగుబంటి సూర్యనారాయణ కేసేమిటి..? కేసీఆర్‌కేం సంబంధం..?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. కేసీఆర్ మాటలకు కౌంటర్ ఇస్తూ.. ఎలుగుబంటి సూర్యనారాయణ కేసు నుంచి .. మోడీ ద్వారా.. కేసు నుంచి పేరు తీయించేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇంతకీ.. ఈ ఎలుగుబంటి సూర్యనారాయణ ఎవరు..? ఆయన కేసుతో.. కేసీఆర్‌కు ఏంటీ సంబంధం..? మోడీ ఈ కేసు నుంచి కేసీఆర్‌ను ఎలా తప్పించారు..? అనే అనుమానాలు చాలా మందిలో ప్రారంభమయ్యాయి. 2006లో ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎలుగుబంటి సూర్యానారాయణ అనే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్రమాలకు పాల్పడి.. భారీగా ఆస్తులు కూడబెట్టి దొరికిపోయారు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఓ అధికారి ఇంత భారీ స్థాయిలో ఎలా అవినీతికి పాల్పడగలరని.. అందరూ.. ఆశ్చర్యపోయారు. ఆ కేసు లింక్ మెల్లగా ఢిల్లీ చేరింది… ఎలాగంటే..?

అప్పట్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయిన… కేసీఆర్.. ఆ తర్వాత కేంద్ర కార్మిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని… విచిత్రంగా..ఈ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌కు ఇచ్చారు. అసలు ఫిషరీష్ డిపార్ట్‌మెంట్ ఈఎస్ఐ ఆస్పత్రి భవన నిర్మాణ కాంట్రాక్ట్ తీసుకోవడమేమిటో… కేసీఆర్ ఇవ్వడం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. తర్వాత ఎలుగుబంటి సూర్యనారాయణ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. ప్రత్యేకంగా జస్టిస్ పాండురంగారావు కమిటీని ప్రభుత్వం నియమించింది. పోలీసులు, జస్టిస్ పాండురంగారావు కమిటీ విచారణలో వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. అప్పట్లో వైఎస్ తెలంగాణ భవన్ నిర్మాణంకు స్థలం కేటాయించారు.. ఆ స్థలంలో ఈ ఎలుగుబంటి సూర్యానారాయణ భవనం కట్టివ్వడంతో పాటు.. కొత్త మొత్తాన్ని హరీష్ రావు ద్వారా.. కేసీఆర్‌కు ముడుపులుగా చెల్లించారనే ఆరోపమలు వచ్చాయి. అప్పట్లో టీఆర్ఎస్ మంత్రులు ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్రంలోనూ ఉన్నారు. తర్వాత రాజీనామాలు చేశారు.

ఎలుగుబంటి కేసు పై జస్టిస్ పాండురంగారావు కమిటీ నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై ఏ చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు కానీ.. ఈఎస్ఐ ఆస్పత్రి కాంట్రాక్ట్‌ను… ఫిషరీస్‌కు ఇవ్వడంపై సీబీఐ కేసు నమోదయింది. ఈ క్రమంలో… ఎలుగుబంటి పాండురంగారావు.. కేసీఆర్‌కు ముడుపులు ఇచ్చిన విషయంపై.. సీబీఐకి క్లారిటీ వచ్చింది. అయితే కొన్నాళ్ల పాటు.. ఆ కేసు అంతర్గతంగానే ఉన్నప్పటికీ.. కేసీఆర్ మొదటి సారి సీఎం అయిన తర్వాత 2015లో బయటకు వచ్చింది. ప్రగతి భవన్‌కు సీబీఐ అధికారుల బృందం వచ్చి సుదీర్ఘంగా ప్రశ్నించి వెళ్లింది. ఆ తర్వాత కేసీఆర్ పూర్తిగా..మోడీకి అనుకూలంగా మారిపోయారు. ఆ తర్వాత ఆ కేసులో కేసీఆర్ పేరు లేదని చెబుతున్నారు. ఇప్పుడు.. టీడీపీ నేతలు.. వచ్చే కేంద్ర ప్రభుత్వంలో తాము భాగస్వామిగా ఉంటామని.. ఆ కేసును బయటకు తీసి.. కేసీఆర్ సంగతి తేలుస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఎలుగుబంటి సూర్యనారాయణ కేసు.. మరో సారి తెరపైకి వస్తోంది.. ఏ మలుపులు తిరుగుతుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close