చంద్రబాబుకు వెయ్యి శాతం నమ్మకం..! ఎందుకంత కాన్ఫిడెన్స్..?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గెలుపుపై చంద్రబాబు .. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవడం లేదు. వీలైనంత ఎక్కువగా మెజార్టీ స్థానాలు సాధించడంపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు. కానీ చంద్రబాబు జాతీయ రాజకీయ వ్యూహం మాత్రం.. టీడీపీ నేతల్లో కంగారుకు కారణం అయింది. చంద్రబాబు ధీమాను చూసి.. వైసీపీ నేతలు కూడా.. గత ఎన్నికల్లోలానే అవుతుందేమోనని కంగారు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లేనని… ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి రెండింతలు జరిగింది. ఎగ్జిట్ పోల్స్, సర్వేలు అన్నీ అలానే వచ్చాయి. ఓ తెలుగు న్యూస్ చానల్ కూడా.. అదే చెప్పింది. కానీ ఒక్క లగడపాటి రాజగోపాల్ మాత్రమే… తన సర్వేను టీడీపీ గెలుస్తుందని ఇచ్చారు. అదే జరిగింది. ఇప్పుడు కూడా.. టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు వ్యూహాన్ని అర్థం చేసుకోలేక టెన్షన్‌కు గురవుతున్నారు.

ప్రజలను నమ్ముతున్న చంద్రబాబు..!

ప్రతిపక్ష పార్టీ గెలుస్తుందంటూ జరుగుతున్న ప్రచారం… రెండు ఇంగ్లిష్ చానళ్లు ఏకపక్షంగా వైసీపీకి, మరో ఇంగ్లిష్ చానల్ హోరాహోరీ ఉంటుందని వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌తో టీడీపీ నేతలు కాస్త గందరగోళానికి గురయ్యారు. అదే సమయంలో.. రిపబ్లిక్ – సీ ఓటర్, టుడేస్ చాణక్య, ఆర్జీ ఫ్లాష్ టీం, ఎలైట్ లాంటి సర్వేలన్నీ టీడీపీ గెలుస్తుందని చెప్పినా… అ ప్రచారం చాలా పరిమితంగానే చేస్తున్నారు. కానీ వైసీపీకి అనుకూలంగా వచ్చిన వాటిని మాత్రం విస్తృతంగా సోషల్ మీడియాలో పెడుతున్నారు. దాంతో.. టీడీపీ నేతలపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. అదంతా మైండ్ గేమ్‌లో భాగమంటున్న చంద్రబాబు… వెయ్యి శాతం గెలుపు ఖాయమంటున్నారు. సర్వేలను… తాము 35 ఏళ్ల నుంచి చేస్తున్నామని.. బయట సంస్థలు ఏదో చెబితే గందరగోళపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. తనకు ప్రజలపై నమ్మకం ఉందంటున్నారు.

పోలింగ్ సరళి టీడీపీకే అనుకూలమని తేలినా ఎందుకంత కంగారు..?

అయితే మౌత్ టాక్ కారణంగా టీడీపీ నేతలు.. కాస్త టెన్షన్‌లో ఉన్నారు. అయితే.. ఈ మౌత్ టాక్ మొత్తం.. పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు నుంచి వచ్చింది. పోలింగ్ రోజు అంటే.. ఏప్రిల్ 11న … ఈవీఎంలు మొరాయించినా… పెద్ద ఎత్తున… మహిళలు, వృద్ధులు క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ట్రెండ్ చూసి.. అంతా టీడీపీకి అనుకూలం అనే ప్రచారం జోరుగా సాగింది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్… దేవుడి దయ అని వ్యాఖ్యానించడంతో వైసీపీ నేతలకు టెన్షన్‌కు గురయ్యారు. అదే సమయంలో ఉదయం పూట… ఈవీఎంలు మొరాయించడంతో.. దాదాపుగా 30 శాతం చోట్ల ఓటర్లు వచ్చి వెనుదిగిరి వెళ్లిపోయారు. కానీ.. మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున మళ్లీ పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. చంద్రబాబు పిలుపునిస్తే వచ్చారు కాబట్టి… అవి టీడీపీకే పడి ఉంటాయన్న అంచనాలకు రాజకీయవర్గాలు వచ్చాయి. అదే సమయంలో.. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున.. ఓటర్లు ఏపీకి వచ్చారు. ఏదో ఓ భావోద్వేగం లేకపోతే.. వారు రారన్న అంచనాలున్నాయి. ఆ భావోద్వేగం.. సొంత రాష్ట్రం కోసం అన్న భావన ఉందంటున్నారు… ఈ కారణాలన్నింటితో .. పోలింగ్ రోజు.. టీడీపీకి ఉత్సాహం.. వైసీపీకి నిరుత్సాహంగా జరిగింది

చంద్రబాబు వీవీ ప్యాట్లపై పోరాటంతోనే అసలు చిక్కులు..!

పోలింగ్ ముగిసిన తర్వాతి రోజే.. వైసీపీలో ఉత్సాహం పెరగడానికి చంద్రబాబు రాజకీయ వ్యూహమే కారణం అయింది. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ కేంద్రంగా ఈవీఎంల మొరాయిపు, వీవీ ప్యాట్లు 50శాతం లెక్కించాలని పోరాటం ప్రారంభించడంతో… ఓడిపోతున్నారు కాబట్టే.. ఇలాంటి పోరాటం చేస్తున్నారని… వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. దీన్ని తిప్పికొట్టడంలో.. టీడీపీ నేతలు నిర్లక్ష్యం చేయడంతో… ఆ జోరును వైసీపీ నేతలు మరింత పెంచేశారు. రెండు, మూడు ఇంగ్లిష్ చానళ్లతో… వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచి.. ఓ అవగాహనతో ఉన్నారు కాబట్టి… అత్యధిక సీట్లు వస్తాయని… మూడేళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎగ్జిట్ పోల్స్ వేరేగా వస్తాయని ఎవరూ అనుకోలేదు. గతంలో కచ్చితత్వం ఎక్కువగా ఉన్న సర్వేలు ప్రకటించిన సంస్థల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చినా.. ఆ ప్రచారాన్ని… బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో.. తెలుగుదేశం నేతలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా.. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా ఆ మైండ్ గేమ్ కొనసాగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close