మహా కూటమి కార్యాచరణ కోసం చంద్రబాబు ఢిల్లీ టూర్

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈనెల 8న ఢిల్లీ వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్రంతో పోరాటంపై ఏపీ ఎంపీల‌తో సమావేశ‌మై చ‌ర్చిస్తారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఈ మ‌ధ్య చేసిన వ్యాఖ్య‌ల‌తోపాటు, పోల‌వ‌రం నిధులు, వెన‌క‌బ‌డిన జిల్లాల‌కు రావాల్సిన ఆర్థిక సాయంపై చేయాల్సిన పోరాటానికి కూడా ఎంపీల‌కు దిశా నిర్దేశం చేస్తారు. దీంతోపాటు, చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ లో మరో కీల‌క‌మైన అంశం మ‌హా కూట‌మి కార్యాచ‌ర‌ణ‌పై ప‌లువురు నేత‌ల‌తో భేటీ అయి చ‌ర్చించ‌బోతుండ‌టం.

భాజ‌పా వ్య‌తిరేక పార్టీల‌తో ఆయ‌న భేటీ అవుతారు. దీన్లో భాగంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో స‌హా మ‌రో ఆరుగురు కీల‌క నేత‌ల‌తో చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని తెలుస్తోంది. శ‌ర‌ద్ ప‌వార్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఫ‌రూక్ అబ్దుల్లాను కూడా క‌లుసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. నిజానికి, డిసెంబ‌ర్ లో జ‌రిగిన మ‌హా కూట‌మి స‌మావేశానికి కొన‌సాగింపుగానే తాజా స‌మావేశం జ‌రుగుతోంది. దీన్లో ప్ర‌ధానంగా… లోక్ స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తూ ఉండ‌టంతో దేశవ్యాప్తంగా భాజ‌పా వ్య‌తిరేక పార్టీల స‌భ‌లూ స‌మావేశాలూ పెద్ద ఎత్తున నిర్వ‌హించే అంశ‌మై చ‌ర్చిస్తార‌ని తెలుస్తోంది. ఈ నెల నుంచే మ‌హా కూట‌మి స‌భ‌లు, ర్యాలీలు ఉండేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తార‌ని అంటున్నారు. రాబోయే నెల‌లో కూట‌మి చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల షెడ్యూల్‌ కూడా ఖ‌రారు చేస్తార‌ని స‌మాచారం.

ఎన్డీయే వైఫ‌ల్యాల‌ను నిర‌సిస్తూ, దేశ‌వ్యాప్తంగా భాజ‌పా వ్య‌తిరేక పార్టీల‌ను ఏకం చేసే ఉద్దేశంతో మ‌హా కూట‌మి ఏర్పాట్లు ముమ్మ‌రం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వివిధ రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖ పార్టీల‌ను ఏక‌తాటి మీదికి తెచ్చేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌కపాత్ర పోషిస్తున్నారు. రాబోయే రెండు నెల‌ల్లో… ఎన్డీయే వైఫ‌ల్యాల‌పై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగేలా చేయాల‌న్న‌దే కూట‌మి తాజా కార్యాచ‌ర‌ణ‌గా ఉంటుంద‌ని చెప్పొచ్చు. నిజానికి, ప‌శ్చిమ బెంగాల్ లో భారీ ర్యాలీ నిర్వ‌హించాల‌నీ గ‌తంలో అనుకున్నారు. అమ‌రావ‌తిలో కూడా భాజ‌పా తీరుకి వ్య‌తిరేకంగా జాతీయ నేత‌ల‌తో పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్టాల‌ని భావించారు. ఎనిమిదిన జ‌రిగే మీటింగ్ లో ఇలాంటి నిర‌స‌న‌ల‌కు సంబంధించిన తేదీల‌ను దాదాపు ఫిక్స్ చేస్తార‌నే అభిప్రాయ‌మే వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close