ఎల్వీ లైట్ తీసుకుంటే కేబినెట్ భేటీ జరగదు..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మంత్రివర్గ సమావేశం విషయంలో… వెనుకడుగు వేసే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. పదే తేదీన కేబినెట్ భేటీ అని.. మీడియాకు లీకులు ఇచ్చినప్పటికీ.. ఎజెండాను.. ఎల్వీ ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆయన ఓకే అంటేనే.. కేబినెట్ భేటీ జరుగుతుంది. లేకపోతే.. నిబంధనల ప్రకారం.. కష్టమే. అయితే.. టీడీపీ అధినేత చాలా తెలివిగా… ప్రకృతి వైపరీత్యాలు, ప్రజల ఇబ్బందులను ఎజెండాగా.. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా.. కేబినెట్ భేటీని వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఉండదు.

తుపాను కారణంగా… నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎన్నికల సంఘం ఎత్తి వేసింది. ఈ నాలుగు జిల్లాల్లో తుపాను సహాయ , పునరావాస చర్యలు చేపట్టడానికి.. ఇప్పుడు.. ఎలాంటి కోడ్ అడ్డంకి లేదు. సహజంగా కోడ్ లేదు కాబట్టి… ఆ అంశాలపై.. కేబినెట్ భేటీ నిర్వహించడానికి కూడా.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయంలో.. అధికారులు క్లారిటీతోనే ఉన్నారు. మామూలుగా అయితే… ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో… కేబినెట్ భేటీ నిర్వహించరు. కానీ చంద్రబాబు పట్టుబట్టి మరీ … ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రంలో.. మోడీ.. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా.. కేబినెట్ భేటీలు నిర్వహించారు. ఆయన నిర్వహించినప్పుడు.. తానెందుకు నిర్వహించలేనని… చంద్రబాబు పట్టుదల. మోడీ కేబినెట్ భేటీ నిర్వహించినప్పుడు… ఈసీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు తాను నిర్వహిస్తే.. ఈసీ ఎలాంటి అభ్యంతరం చేసినా.. దాన్ని జాతీయ స్థాయి ఇష్యూగా మార్చి. ఈసీ … వ్యవహారశైలిని చర్చనీయాంశం చేయాలన్న ఆలోచన కూడా.. చంద్రబాబులో ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికిప్పుడు.. కేబినెట్ భేటీ ఎజెండాగా… తుపాను ఫణి సహాయ, పునరావాస కార్యక్రమాలు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి ఎద్దడి తగ్గించడానికి చేయాల్సిన ఏర్పాట్లు వంటివి.. ఎజెండాలో ఉన్నాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యం.. కేబినెట్ భేటీ ఏర్పాటు గురించి.. ఈసీ అభిప్రాయం తెలుసుకునే అవకాశం ఉంది. ఈ అంశాలపై కోడ్ వర్తించదు కాబట్టి.. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికే అవకాశం ఉంది. అయితే.. చంద్రబాబు టార్గెట్‌లో… నేరుగా ఎల్వీనే ఉన్నారు. సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్న ఎల్వీపై చర్యలు తీసుకోవడం కూడా.. కేబినెట్ ఎజెండాలో ఉండి చివరి క్షణంలో అయినా వచ్చి తీరుతుంది. అందుకే.. ఎల్వీ కూడా.. ఈ కేబినెట్ భేటీ జరగకుండా చూసేందుకే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close