“కులం ముద్ర”పై చంద్రబాబు స్పందన టూ.. లేట్..!

అమరావతిపై ఓ సామాజికవర్గ ముద్రను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి వేస్తోందని తెలిసినా.. తిప్పికొట్టేందుకు అప్పటి ప్రభుత్వం కానీ.. అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ కానీ ప్రత్యేకమైన ప్రచార ప్రణాళికలేమీ వేసుకోలేదు. ఫలితంగా దెబ్బతిన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ.. రాజధాని మార్పు కోసం.. అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే ఏం జరుగుతుందో టీడీపీకి తెలిసి వచ్చినట్లుగా ఉంది. కొద్ది రోజులుగా.. అధికారపార్టీపై.. సామాజిక కోణంలోనే ఎదురుదాడి చేస్తున్నారు. చంద్రబాబు కూడా.. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు.

చంద్రబాబు వేసిన ప్రశ్న.. ఇప్పటి వరకూ.. రాజధాని ఒకే సామాజికవర్గానిదంటూ… జరిగిన ప్రచారాన్ని నమ్మిన వారిని ఆలోచింపచేసేలా చేసింది. అమరావతి ఒక్క సామాజికవర్గానిదే ఎలా అవుతుందనే చర్చలు.. ప్రారంభించేలా చేసింది. అదే సమయంలో.. టీడీపీ అధినేత.. మరింత దూకుడుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. రాజధానిపై కులం ముద్ర వేయడం.. వైశాచికత్వానికి నిదర్శనమని మండిపడటమే కాదు… హైదరాబాద్‌ను ఉదాహరణగా చెబుతున్నారు. తాము హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని.. ఇప్పుడు అక్కడ కొన్ని లక్షల మంది లబ్ది పొందుతున్నారని.. వారంతా.. ఒకే సామాజికవర్గం వారా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సామాజికవర్గం కోసమే అభివృద్ధి చేశామా… అని సూటిగానే అడుగుతున్నారు. ఓ నగరం అభివృద్ది చెందితే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా… ప్రజలందరూ లబ్దిపొందుతారని గుర్తు చేస్తున్నారు.

అమరావతిపై సామాజిక ముద్ర వేసి తరలిస్తే… జగన్ టార్గెట్ పెట్టుకున్న సామాజికవర్గం నష్టపోతుంది… అలాగే.. వారి కన్నా… మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు నష్టపోతాయి. కానీ.. వారు నష్టపోయినా పర్వాలేదు… తాము టార్గెట్ పెట్టుకున్న సామాజికవర్గం మాత్రం నాశనమైపోవాలన్నట్లుగా అధికార పార్టీ తీరు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ విషయాన్ని సూటిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల్లో పడిపోయిన ముద్రను.. ఇప్పుడు.. చెరపగలరా.. అన్నదే.. అసలైన పాయింట్.. అందుకే.. ఈ విషయంలో చంద్రబాబు ఆలస్యంగా మేలుకున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close