ఆ స్వామీజీపై చంద్ర‌బాబు నిఘా పెట్టించారా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఎప్పటిక‌ప్పుడు విమ‌ర్శ‌లు గుప్పించేవారిలో విశాఖ‌ప‌ట్నం శార‌దాపీఠాధిప‌తి స్వామీ స్వ‌రూపానంద ఒక‌రు. చంద్ర‌బాబు స‌ర్కారుపై ఆయ‌న‌లో వ్య‌తిరేక‌త అంత‌గా పెంచిన కార‌ణ‌మేంటో తెలీదుగానీ.. కొద్దిరోజుల క్రితం విజ‌య‌వాడ‌లోని కృష్ణాన‌దీ తీరంలో జ‌రిగిన బ్రాహ్మ‌ణ గ‌ర్జ‌న కార్య‌క్ర‌మంలో స్వామీజీ తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు. ప్ర‌భుత్వ తీరుపై కాస్త తీవ్రంగానే మండిపడ్డారు. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల స్వ‌రం పెంచుతున్న స్వ‌రూపానందపై ఏపీ స‌ర్కారు నిఘా వేసింద‌ని తెలుస్తోంది.

స్వామీజీ ఎక్క‌డికి వెళ్లినా నిఘా వ‌ర్గాలు కూడా ఆయ‌న్ని అనుస‌రిస్తున్నాయట‌! ఏపీ పోలీస్ నిఘా విభాగం అధికారులు ఆయ‌న క‌ద‌లిక‌ల‌పై రెండు క‌ళ్లూ వేసి ఉంచాయ‌ని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి స్వామీజికి వెళ్లినా స్వామిపై నిఘా నేత్రం ఉంటోంది. అంతేకాదు, ఆ మ‌ధ్య చాతుర్మాస దీక్ష సంద‌ర్భంగా రిషీకేష్‌కి స్వామీజీ కొన్నాళ్లు వెళ్లారు. ఏపీ నుంచి ప్ర‌త్యేకంగా అక్క‌డినీ నిఘా వర్గాల‌కు చెందిన అధికారుల‌ను పంపించి మ‌రీ స్వామీజీ క‌ద‌లిక‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కారు నివేదిక‌లు తెప్పించుకుంద‌ని స‌మాచారం.

తాజాగా విశాఖ శార‌దాపీఠం బాధ్య‌త‌ల్ని త‌న స‌హాయ‌కుడు కిర‌ణ్ కుమార్ శ‌ర్మ‌కు అప్ప‌గించాల‌ని స్వామీజీ నిర్ణ‌యించుకోవ‌డం విశేషం. శేష జీవితాన్ని రిషీకేష్‌కి వెళ్లి గ‌డ‌పాల‌న్న ఉద్దేశంతోనే తానీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స్వామీజీ చెబుతున్నారు. అయితే, స్వామీజీ నిర్ణ‌యం వెన‌క ఇంకేవైనా శ‌క్తులు ప‌నిచేసి ఉంటాయేమో అనే అనుమానాలను కూడా కొంత‌మంది వ్య‌క్తం చేస్తున్నారు. బ‌లంగా వినిపిస్తున్న మ‌రో మాట ఏంటంటే… చంద్ర‌బాబు నివాసానికి స్వామీజీ సమీపంలో ఉంటే ప్ర‌భుత్వానికి ఇబ్బంది క‌లిగించే పరిస్థితులు వ‌చ్చే అవ‌కాశం ఉందంటూ ఓ మంత్రి స్వ‌యంగా ఆఫ్ ద రికార్డ్‌లో వ్యాఖ్యానించిన‌ట్టు చెప్పుకుంటున్నారు. ఆ మంత్రి స్వామీజీకి అత్యంత స‌న్నిహితుడు కావ‌డం విశేషం! మొత్తానికి, ఒక స్వామీజీపై చంద్ర‌బాబు స‌ర్కారు ఇలా నిఘా పెట్టించింద‌నేది మాత్రం విశేష‌మే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close