కుమిలిపోతున్న చంద్రబాబు….!

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనేక బాధల్లో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే ఎందుకు ఓడిపోయానో అర్థం కావడంలేదంటూ చాలాకాలం కుమిలిపోయాడు. ఎక్కడికి వెళ్లినా ‘నేనేం తప్పు చేశాను. నన్ను ఎందుకు ఓడించారు?’ అంటూ పదేపదే ప్రశ్నించాడు. తనకు ఘోర అవమానం జరిగినట్లుగా తెగ బాధపడిపోయాడు. తాను ఏ తప్పూ చేయలేదని బల్ల గుద్ది మరీ చెప్పాడు. తప్పు చేయకపోయినా తనను ఓడగొట్టి ప్రజలే పెద్ద తప్పు చేశారని, జగన్‌ను తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారని అంటూ కాలక్రమంలో కొంత కుదుటపడి జగన్‌ మీద పోరాటం ప్రారంభించాడు. జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినరోజు నుంచే టీడీపీ పోరాటం ప్రారంభమైంది.

ఇదిలా కొనసాగుతుండగానే టీడీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. వాస్తవానికి టీడీపీ ఓడిపోగానే ఆయనకు కుడిఎడమ భుజాలవంటి సుజనా చౌదరి, సీఎం రమేష్‌ మరికొందరు కాషాయ పార్టీలోకి వెళ్లిపోయారు. వాళ్లను చంద్రబాబే ఉద్దేశపూర్వకంగా కమలం పార్టీలోకి పంపారని ప్రచారం జరిగిందనుకోండి. అది వేరే విషయం. ఈమధ్యనే గన్నవరం ఎమ్మెల్యే వంశీ పెద్ద ఎపిసోడ్‌ నడిపాడు. దీంతో టీవీ ఛానెళ్లు పండగ చేసుకున్నాయి. నాలుగు రోజులపాటు ఏకబిగిన వంశీ వర్సెస్‌ టీడీపీ వార్‌ దృశ్యాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను మరిపించేలా టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. అయ్యప్ప దీక్షలో ఉన్న వంశీ పూజలు పునస్కారాలు, భజనలు పక్కకు పెట్టి టీడీపీ మీద, అధినేత మీద, ఆయన పుత్రరత్నం లోకేష్‌ మీద వీరంగం వేశాడు. దీంతో టీడీపీ నాయకులూ చెలరేగిపోయారు.

వంశీ వైకాపాలోకి వెళ్లడానికి ప్లాన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. దేవినేని అవినాష్‌ వైకాపాలోకి జంపయ్యాడు. ఇవన్నీ చంద్రబాబుకు ఆవేదన కలిగిస్తున్నాయి. ఇవి ఒక ఎత్తయితే ఆయన మానస పుత్రిక ‘అమరావతి’ ఒక ఎత్తు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ముఖ్యమంత్రయిన చంద్రబాబు గొప్ప రాజధాని నిర్మించి చరిత్రలో నిలిచిపోవాలనుకున్నాడు. ఆయన సీఎం అయ్యే సమయానికి ఏపీ ప్రజలు హైదరాబాదును కోల్పోయామన్న తీవ్ర బాధలో ఉన్నారు. హైదరాబాదు కోసమే కదా ఆంధ్రులు సమైక్య రాష్ట్రమంటూ ఉద్యమం చేశారు. తెలంగాణ విడిపోయినా బాధ లేదు. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండాలని డిమాండ్‌ చేశారు. కాని వారు ఎంత పోరాడినా అనుకున్నది సాధ్యం కాలేదు.

అప్పుడే చంద్రబాబు నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే రాజధాని నిర్మించుకుంటామని కేంద్రానికి ప్రతిపాదించారు. పీఠం ఎక్కగానే రాజధాని పని ప్రారంభించారు. సుమారు 33 వేల ఎకరాల భూమి సేకరించారు. ఆ తరువాత జరిగిన కథ ఏమిటో చెప్పుకుంటే భారతమంత అవుతుంది. చంద్రబాబు తాను పాలించిన ఐదేళ్లూ బ్రహ్మాండమైన, అద్భుతమైన అమరావతిని ప్రజలు కలల్లో ఆవిష్కరించాడు. హైదరాబాదును మించిన రాజధాని నిర్మిస్తానన్నాడు. ఏపీ ప్రజలు విభజన బాధ నుంచి బయటపడకుండా చూసుకున్నాడు. ఎప్పుడూ విభజన కష్టాల గురించే మాట్లాడేవాడు. అద్భుత రాజధాని నిర్మించి చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే కథ అడ్డం తిరిగి ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యాడు.

ఇప్పుడు జగన్‌ అమరావతిని మూలపడేసేసరికి ఆయనకు ఒళ్లు మండిపోతోంది. ‘అమరావతి ఆగిపోతే తెలుగు జాతికి తీవ్ర నష్టం’ అన్నాడు బాబు. అమరావతిని రద్దు చేయకూడదని కేంద్రం చెప్పినా మీ బుర్రకు ఎక్కలేదా? అని జగన్‌ను ప్రశ్నించాడు. కమిటీల మీద కమిటీలు ఎందుకు వేస్తున్నారో అర్థం కావడలేదన్నాడు. సింగపూర్‌ ప్రభుత్వం వెనక్కి వెళ్లిపోయినప్పుడే మీరు ఎంత మూర్ఖులో అర్థమైందంటూ మండిపడ్డాడు. తెలంగాణకు హైదరాబాదు ఉంది..కర్నాటకకు బెంగళూరు ఉంది..తమిళనాడుకు చెన్నై ఉంది. ఏపీకి ఏముంది? అంటూ కుమిలిపోతున్నాడు చంద్రబాబు. దీనికి జగన్‌ సమాధానమేమిటో….!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close