బాబు హామీ ఎఫెక్ట్…ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న దివాకర్స్

అసలే ఫ్యాక్షనిజం నేపథ్యం ఉన్నవాళ్ళు. జేసీ బ్రదర్స్ ఏ స్థాయి ఫ్యాక్షనిస్టులు, రౌడీలు అనే విషయంపై ఇప్పుడు కొత్తగా ఎవరూ థీసిస్ చేయక్కర్లేదు. పరిటాల రవి హత్య జరిగిన తర్వాత రోజుల్లో జేసీల హత్యా రాజకీయాల గురించి గల్లీ నుంచీ ఢిల్లీ వరకూ చంద్రబాబే ఓ రేంజ్‌లో ప్రచారం చేసిపెట్టాడు. అలాంటి వారి బిజినెస్ వ్యవహారాలు ఎలా ఉంటాయి? దందాలు, వసూళ్ళు చేస్తామని చెప్పి డైరెక్ట్‌గా మీడియాతోనే చెప్పేస్తున్న వాళ్ళు చేసే బిజినెస్ ఎలా ఉంటుంది? వేరే ఏవైనా ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉండే బిజినెస్‌లు అయితే ఏమో అనుకోవచ్చు కానీ ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉండే ట్రావెల్స్ బిజినెస్‌ని మాత్రం అడ్డదిడ్డంగా నిర్వహించేస్తున్నారు జేసీ బ్రదర్స్. పది మంది ప్రణాలు పోయిన ఘటనలో దివాకర్స్ ట్రావెల్స్ ఓనర్స్ అయిన జేసీ బ్రదర్స్‌ది, బస్సుది అస్సలు ఏ తప్పూ లేదని రిపోర్ట్స్ వచ్చేలా చేశారు చంద్రబాబు. చనిపోయిన డ్రైవర్‌దే తప్పు. అది కూడా కావాలని చేసిన తప్పు కాదు. నిర్లక్ష్యం కూడా లేదు అని సర్టిపికెట్ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకూ జేసీ బ్రదర్స్‌ ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలూ ఉండవు. ఉండకూడదు అని అధికారులందరికీ, పోలీసులకు చాలా స్పష్టంగా ఆర్డర్స్ పాస్ చేసినట్టుగా ఉంది ఆ రిపోర్ట్.

ఆ ప్రభావం వెంటనే కనిపించింది. ఈ సారి బాధితుడు భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వర్కట్‌పల్లి వాసి కందుకూరి నరసింహ. తన ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉన్నాడు నరసింహ. శరవేగంగా దూసుకొచ్చిన దివాకర్స్ ట్రావెల్స్ బస్సు ఆ టూవీలర్‌ని యాక్సిడెంట్ చేసింది. ఆ యాక్సెడెంట్‌ని అస్సలు పట్టించుకోకుండా అదే వేగంతో బస్సును ముందుకు పోనిచ్చాడు దివాకర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సాంబయ్య. అది చూసిన స్థానికులు వెహికల్స్‌పై బస్సును వెంబడించారు. అర కిలోమీటరు తర్వాత బస్సును అడ్డుకోగలిగారు. డ్రైవర్‌ని కిందికి దింపి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ప్రమాదంలో నరసింహ, అతని కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు డ్రైవర్‌కి దేహశుద్ధి చేశారు కానీ రేపు ఈ కేసులో కూడా ప్రభుత్వ రిపోర్టులు ఎలా వస్తాయో చూడాలి.

బస్సు కేవలం యాభై కిలోమీటర్ల స్పీడ్‌తోనే వెళుతోంది. నరసింహానే తన టూ వీలర్‌తో దివాకర్స్ ట్రావెల్స్ బస్సును బలంగా గుద్దాడు. దాంతో భయపడిన బస్సు డ్రైవర్ సాంబయ్య…బస్సుతో సహా ప్రాణభయంతో పారిపోవాలని ట్రై చేశాడు. కానీ సాంబయ్య తాలూకూ రౌడీలు ఛేజ్ చేసి మరీ దివాకర్స్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌పైన అటాక్ చేశారు. ఇందులో ట్రావెల్స్ యజమానుల తప్పు ఏమీ లేదు. బస్సు డ్రైవర్ తప్పుకూడా ఏమీ లేదు. నరసింహని, అతని కూతురిని, డ్రైవర్‌పైన దాడిచేసిన స్థానికులను కఠినంగా శిక్షించాలని చెప్తారేమో.

హెచ్చరికః ఇందుమూలంగా యావన్మందికి విన్నవించుకునే విషయం ఒక్కటే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం, జేసీ బ్రదర్స్ టిడిపిలో ఉన్నంత కాలం జేసీ బ్రదర్స్ బస్సులతో జాగ్రత్తగా ఉండగలరు. వీలైనంత దూరం పాటించగలరు. లేకపోతే మీరు మరో నరసింహ కాగలరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close