ప్రొ.నాగేశ్వర్ : కాంగ్రెస్‌ గెలవాలని చంద్రబాబు ఎందుకు ఆశ పడుతున్నారు..!?

తెలంగాణ ఎన్నికల ఫలితం బ్యాలెట్ బాక్సుల నుంచి బయటకు వస్తోంది. ఇలాంటి సమయంలో.. కాంగ్రెస్ పార్టీ గెలవాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు తాపత్రయ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు చాలా తీవ్రంగా ప్రయత్నించారు కూడా. అయితే.. ఆయన ఇలా ప్రయత్నించడానికి.. టీఆర్ఎస్ నేతలు వేరే అర్థాలు చెప్పుకోవచ్చు. పెత్తనం చెలాయించడానికి వస్తున్నారని విమర్శలు చేస్తూండవచ్చు. కానీ..తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తోంది పదమూడు సీట్లు మాత్రమే.

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో చంద్రబాబుకు ప్రయోజనమా..?

లగడపాటి సర్వే నిజం అయి… కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టినా.. టీడీపీ ఈ కూటమిలో మేజర్ పార్టీ కాదు. పోటీ చేస్తున్న పదమూడు సీట్లలలో ఎన్ని గెలుస్తారో తెలియదు. ఎన్ని సార్లు.. ప్రభుత్వాన్ని రూల్ చేసేంత శక్తి ఉండదు. కానీ.. చంద్రబాబు… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఎందుకు తాపత్రయ పడుతున్నారంటే… ఢిల్లీ స్థాయి రాజకీయాలు.. అలాగే రాజకీయాలు కారణం అని అనుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఏపీలో చంద్రబాబు ఇమేజ్ పెరుగుతుంది. తెలంగాణలో కేసీఆర్‌నే ఓడించా.. ఏపీలో రాజకీయ నాయకులు తనకో లెక్కా .. అన్నట్లుగా చెప్పుకుంటారు. అందుకే… ఈ ఫలితం…కచ్చితంగా కీలకం అవుతుంది. అదే సమయంలో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలో గెలిస్తే.. దానికి ఏపీలో… ఆమోదం లభించవచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని … చాలా తీవ్రంగా విమర్శించి.. ఏపీకి అన్యాయం చేసిన పార్టీగా చెప్పి.. ఆ పార్టీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా ఓట్లు అడిగారు. అందువల్ల పెట్టుకోబోయే పొత్తునకు.. సాధికారితను.. సానుకూలతను తెచ్చుకుటున్నారని అనుకోవచ్చు. అలాగే.. పిల్ల కాంగ్రెస్ అని విమర్శించిన వైసీపీ… తల్లి కాంగ్రెస్‌తో వెళ్లకుండా.. చూసుకోవడం. చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోతే.. ప్రత్యేకహోదా ఇస్తామంటున్న కాంగ్రెస్‌తో రేపు వైసీపీ పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితిని చంద్రబాబు నివారించడానికి అని చెప్పుకోవచ్చు.

ఢిల్లీ రాజకీయాలు మారాలన్నా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలా..?

ఢిల్లీ రాజకీయాలు కూడా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవాలని చంద్రబాబు బలంగా కోరుకోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. తెలంగాణను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చే పరిస్థి లేదనుకుందాం..! అలాగే మిత్రులను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదనుకోండి.. కర్ణాటకలాగా..ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చి… ముఖ్యమంత్రిని చేశారు. అలాగే ఢిల్లీలోనూ.. రాజకీయ పరిణామాలు ఏర్పడే అవకాశాన్ని కొట్టి పారేయలేం. గతంలో దేవేగౌడ , గు‌జ్రాల్‌లు ప్రధానమంత్రులయ్యారు. అందువల్ల ఆ పరిస్థితే వస్తే.. చంద్రబాబుకు అడ్వాంటేజ్ అవుతుంది. చంద్రబాబు ప్రాంతీయ పార్టీల నేతలందర్నీ కూడగడుతున్నారు. ఢిల్లీ స్థాయి రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. కర్ణాటక తరహా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రం తప్పనిసరి.

ఢిల్లీలో ప్రధాన పదవికి రేసులో ఉండాలనుకుంటున్నారా…?

నిజానికి ప్రాంతీయ పార్టీల నుంచి చాలా మంది ప్రధాన మంత్రి పదవికి పోటీ దారులు ఉన్నారు. మాయావతి, మమతా బెనర్జీ, శరద్ పవార్ తో పాటు చాలా మంది రేసులో ఉన్నారు. ఈ రేసులోకి చంద్రబాబునాయుడు కూడా రావాలని.. టీడీపీ నేతలు భావించారు. అందుకే.. ఈ ప్రయోగాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున బాధ్యతలు తీసుకున్నారు. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా .. ఎక్కువగా కేర్ తీసుకుని.. రాజకీయ వ్యూహాలు రచించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నించారు. అందువల్ల.. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నించడలో.. ఓ విస్తృత రాజకీయ వ్యూహం ఉందని నేను అనుకుంటున్నారు. అది తెలంగాణ పై పెత్తనం చేయడం మాత్రం కాదు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.