ప్రొ.నాగేశ్వర్ : పేజీ 28, 29 సీక్రెట్స్ ఏమిటో వైసీపీ, తెలంగాణ పోలీసులు బయటపెట్టాలి..!

డేటా చోరీ అంశం కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి అందించిన ఫిర్యాదు బయటకు వచ్చింది. గత నెల 22న విజయసాయిరెడ్డి.. ఎన్నికల సంఘానికి ఓ ఫిర్యాదు అందించరు. ఆ ఫిర్యాదు కాపీలో ఉన్న యాక్షన్ ప్లాన్ లో ఉన్న విధంగా .. తెలంగాణ పోలీసులు కార్యాచరణ ప్రారంభించారు. అందులో ఎలా ఉంటే అలా చేయడం ప్రారంభించారు. దీంతో.. ఇప్పుడు డేటా చోరీ అంశం కీలక మలుపునకు కారణం అయింది.

హైదరాబాద్ పోలీసులతో కలిసి విజయసాయిరెడ్డి కుట్ర చేశారా..?

డేటా చోరీ అంశలో… చంద్రబాబు నాయుడు బయటకు వెల్లడించిన పత్రాలు.. చాలా ముఖ్యమైనవే. వాటిపై.. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు… వైసీపీ నుంచి రెస్పాన్స్ రావాలి. తెలంగాణ పోలీసుల ద్వారా.. ఏపీపై పెత్తనానికి…కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబు ఎక్స్‌పోజ్ చేయాలనుకున్నారు. దానికి తగ్గట్లుగానే…తన వాదన వినిపించారు. కోడికత్తి కేసులోనూ… జగన్ హైదరబాద్‌లో ఫిర్యాదు చేశారు. ఈ డేటా చోరీ అంశంలో.. పోలీసులు రెండు కీలకమైన అంశాలపై… సమాధానం చెప్పాల్సి ఉంది. ఒకటి.. మార్చి రెండున లోకేశ్వర్ రెడ్డి కేసు పెడితే తామే రియాక్టయ్యామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిటికల్ ఇష్యూలో.. తెలంగాణ పోలీసులకు సంబంధం ఏమిటి..? అనేది ఇక్కడ ప్రధానమైన సందేహం. హైదరాబాద్‌లో క్రైమ్ జరిగింది కాబట్టి.. కేసు నమోదు చేశామని.. పోలీసులు చెబుతున్నారు. ఆ క్రైమ్ ఏందంటే.. ఏపీ ప్రభుత్వ డేటాను.. హైదరాబాద్‌లోని.. ఐటీ గ్రిడ్ కంపెనీ చోరీ చేసిందనే కేసు వచ్చింది కాబట్టి.. విచారణ ప్రారంభించారు. కానీ చంద్రబాబు ఫిబ్రవరి 23నే… ఐటీ గ్రిడ్‌పై పోలీసులు సోదాలు చేసి.. సమాచారాన్ని తీసుకెళ్లారని ఆధారాలు బయట పెట్టారు. దీన్ని ఎందుకు తీసుకెళ్లారు..?.

ఫిబ్రవరి 23వ తేదీన సోదాలతోనే అసలు గుట్టు బయట పడుతుందా..?

ఫిబ్రవరి 22న ఎలక్షన్ కమిషన్ విజయసాయిరెడ్డి ఈసీకి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత 23న తెలంగాణ పోలీసుల యాక్షన్ ప్రారంభమయింది. అందుకే.. ఎప్పుడు.. పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు..? ఎప్పుడు యాక్షన్ ప్రారంభించారనే ప్రధానమైన ప్రశ్న ఇక్కడ వస్తోంది. మొదట సైబరాబాద్ సీపీ సజ్జనార్ 23వ తేదీన సోదాలు చేసినట్లు అంగీకరించలేదు. కానీ టీడీపీ నేతలు సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టడంతో.. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర మాత్రం.. ఆ ఆఫీసులో…సోదాలు చేసినట్లు అంగీకరించారు. కంప్లైంట్ వస్తుందని ఊహించి.. సోదాలు చేశారా.. అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఈ ప్రశ్నకు..తెలంగాణ పోలీసుల నుంచి కచ్చితంగా…సమాధానం చెప్పాలి. మార్చి రెండో తేదీన కేసు నమోదైతే.. ఫిబ్రవరి 23న సోదాలు ఎలా ..ఎందుకు చేశారో కచ్చితంగా చెప్పాలి. ఇది రాజకీయ పార్టీలు, రాష్ట్రాల పంచాయతీ కాదు. కోర్టులున్నాయి కాబట్టి.. దీనికి కచ్చితంగా తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంది.

తెలంగాణ పోలీసులు, వైసీపీ అధికారికంగా వివరణ ఇవ్వాల్సిందేనా..?

అలాగే.. విజయసాయిరెడ్డి…తన ఫిర్యాదుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో పాటు.. ఐటీగ్రిడ్‌లో… ఏం చేయాలి.. ఎలాంటి సమాచారం బయటకు రావాలన్న ప్లాన్‌ను… జత చేశారు. అయితే.. అది పొరపాటున ఈసీకీ ఇచ్చారు. ఈసీ అధికారులు ఆ ఫిర్యాదును రికార్డు చేసుకుని.. ఆంధ్రప్రదేశ్‌ సీఈవోకు పంపారు. అచ్చంగా విజయసాయిరెడ్డి చెప్పినట్లే.. పోలీసులు ఇంత వరకూ చేయడంతో.. చంద్రబాబు… కూడా… అదే అస్త్రంగా ఎక్కుపెట్టారు. డేటా వార్‌లో ఇప్పుడు.. తెలంగాణ పోలీసులతో పాటు.. వైసీపీ నుంచి కూడా వివరణ రావాల్సి ఉంది. ఇలాంటి స్కెచ్‌లు నిజమా..? కంప్లైంట్‌లోని పేజీ 28, 29 పేజీల గురించి.. వైసీపీ వివరణ ఇవ్వాలి. విజయసాయిరెడ్డి స్కెచ్ రాసుకున్నారా..? ముందుగానే వేసుకున్న ఎత్తుగడలో భాగమా..? అన్నది వైసీపీ. ఇది నిజమా.. కాదా… అన్నది వైసీపీ చెప్పాలి. వాళ్లేం చెబుతారో కానీ.. అది నిజమే అయినప్పుడు.. తెలంగాణ పోలీసుల నుంచి వివరణ రావాల్సి ఉంది. ఆ స్కెచ్‌ను ఎందుకు ఇంప్లిమెంట్ చేశారో చెప్పాలి..! .నేరుగా విజయసాయిరెడ్డి.. ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో ఆ పేపర్లు పెట్టారు కాబట్టి.. అది డాక్యుమెంటెడ్ ప్రూఫ్. తమది కాదని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు.., ఈ విషయాలను తెలంగాణ పోలీసులు, ఈసీ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది.

పక్కా స్కెచ్ అని స్పష్టంగా తెలుస్తుందా..?

అది ఫిర్యాదులో భాగం అనుకోవడానికి లేదు. అది చదవితేనే.. ఫిర్యాదా.. లేక ఆ తర్వాత తీసుకోవాల్సిన యాక్షన్ ప్లానా అన్నది స్పష్టమవుతుంది. ఈ పేజీలపై.. కచ్చితంగా… వైసీపీ వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ పేజీలు ఇచ్చారని.. ఎన్నికల సంఘం కూడా నిర్దారించాల్సి ఉంది. ఇవన్నీ చేయాలి అనుకుని కంప్లైంట్ ఇచ్చారా..? అన్నది కీలకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.