ప‌వ‌న్ కోసం ‘పింక్‌’ ని మారుస్తున్నారా?

‘పింక్‌’ రీమేక్‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ రీ ఎంట్రీలో చేయ‌బోతున్న సినిమాల్లో ఇదొక‌టి. అయితే ‘పింక్‌’ క‌థ ఇప్ప‌టికే బాగా న‌లిగిపోయింది. త‌మిళంలోనూ రీమేక్ అయిన సినిమా ఇది. ఇక్క‌డి మ‌ల్టీప్లెక్స్ ప్రేక్ష‌కులు ‘పింక్‌’ని ఇది వ‌ర‌కే చూసేశారు. క‌థేమిటి? ఇందులో ప‌వ‌న్ పాత్ర ఏ స్థాయిలో ఉంటుంది? అనేవి వాళ్ల‌కు తెలుసు. ఇది వ‌ర‌కు ‘పింక్‌’ చూసిన‌వాళ్ల‌కు సైతం ప‌వ‌న్ ‘పింక్‌’ కొత్త‌గా క‌నిపించేలా.. చిత్ర‌బృందం ఇప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

క‌థ‌, స్క్రీన్ ప్లే, అమితాబ్ పాత్ర‌.. వీటిలో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేయ‌బోతోంది. పింక్‌లో అమితాబ్ వృద్ధ లాయ‌ర్‌. ఆ పాత్ర‌ని ప‌వ‌న్ చేస్తున్నాడు కాబ‌ట్టి – అదే గెట‌ప్‌లో చూపిస్తే బాగోదు. దాంతో పాటు ఆ పాత్ర నేప‌థ్యం, స్టైల్ అన్నీ మార‌తాయి. కోర్టు వాద‌న‌లే.. ఈ క‌థ‌కు మూలం. దాంట్లో వేలు పెట్టే సాహ‌సం తెలుగు రూప‌క‌ర్త‌లు చేయ‌క‌పోవ‌చ్చు. మిగిలిన పాత్ర‌ల నేప‌థ్యాల్ని మారిస్తే ఈ క‌థ‌కు ఓ కొత్త అందం తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. ఇది వ‌ర‌కు ‘ఓ మై గాడ్‌’ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న‌ప్పుడు ప‌వ‌న్ అభిమానుల‌కు న‌చ్చేలా కొన్ని మార్పులూ చేర్పులూ చేశారు. ‘కొన్ని కొన్ని సార్లు రావ‌డం లేట‌వ్వ‌చ్చు.. కానీ రావ‌డం మాత్రం ప‌క్కా’ లాంటి డైలాగులు జోడించారు. ‘పింక్‌’ కోసం కూడా అదే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close