చెవిరెడ్డి టు తోపుదుర్తి..! పెన్షన్ల పంపిణీల్లో రాజకీయ సెగలు..!

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేరుగా ఓటర్లకు.. నగదు రూపంలో లబ్ది చేకూర్చే పథకాలను పకడ్బందీగా మార్కెట్ చేసుకోంటోంది. పెన్షన్ల పేరుతో ఒక్కొక్కరికి రూ. మూడు వేలు పంపిణీ చేస్తోంది. అలాగే.. డ్వాక్రా మహిళలకు అదనంగా.. రూ. పది వేల చెక్కులు అందజేస్తున్నారు. అంటే.. ఏ మాత్రం చిన్న మొత్తం కాదు. పైగా తెలుగుదేశం పార్టీ.. నేతలు.. పండుగలా.. కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. అల్పాహార విందు, భోజనాలు ఏర్పాటు చేసి… ” ఉప్పు తింటున్నారు.. ఓటు మర్చిపోవద్దు” అని అర్థం వచ్చేలా సందేశాలు ఇచ్చి పంపుతున్నారు. ఇది వైసీపీ నేతలకు టెన్షన్ పుట్టిస్తోంది. కొన్ని చోట్ల.. ఈ కార్యక్రమాలను అడ్డుకునేందుకు తీవ్రమైన ప్రయత్నాలే చేస్తున్నారు.

చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. పెన్షన్లు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హోదాలో వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం.. అధికారులు కూడా అభ్యంతర చెప్పలేదు. కానీ.. తన ప్రసంగం సమయంలో.. మొత్తం వైసీపీ పథకాల గురించి చెప్పుకోవడం ప్రారంభించడంతో గందరగోళం ఏర్పడింది. చెవిరెడ్డిని పక్కకు పంపి… చెక్కులు, పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు. అయితే తన అనుచరల సాయంతో.. ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రగడ జరిగింది. దాంతో పోలీసులు ఆయనను పక్కకు తీసుకెళ్లారు. పడిపోయినట్లు చెవిరెడ్డి… చలనం లేకుండా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే.. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. పెనుకొండ వైసీపీ ఇన్చార్జ్.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్వగ్రామం.. తోపుదుర్తిలో.. పెన్షన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పరిటాల సునీత వస్తున్నారని.. ప్రచారం జరగడంతో… తోపుదుర్తి వర్గీయులు ఆందోళన చేపట్టారు. వారందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని మరో వర్గం .. ఈ కార్యక్రమానికి వచ్చిన పరిటాల శ్రీరామ్‌కు ఘనస్వాగతం పలికింది. తోపుదుర్తి వర్గీయులు అడ్డుకున్నా… కార్యక్రమాన్ని నిర్వహించారు.

నేరుగా నగదు పంపిణి పథకాలు కావడంతో.. ఓటర్లపై.. తీవ్ర ప్రభావం చూపిస్తాయని.. వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే.. ఆయా.. పథకాల కార్యక్రమాలను వీలైనంత వరకు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొదట్లో.. చెల్లని చెక్కులని చెప్పిన వారు.. తర్వాత.. అప్పు అంటూ.. ప్రచారం చేశారు. అవేమీ.. ప్రజల్లోకి పెద్దగా వెళ్లకపోవడంతో… పంపిణీ కార్యక్రమాల్లో అలజడి రేపుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close