ఐపీఎల్ కొత్త స్పాన్సర్‌వీ చైనా డబ్బులే..!

ఒక్క ఏడాదికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్‌ను డ్రీమ్ 11 అనే సంస్థ దక్కించుకుంది. దీని గురించిన ఆన్‌లైన్ గేముల గురించి అలవాటు పడిన వారికి బాగా తెలుసు. టాటా,పతంజలి, బైజులాంటి సంస్థలు పోటీ పడినట్లుగా ప్రచారం జరిగినా..చివరికి ఊరూపేరూ లేని డ్రీమ్11 సంస్థ హక్కులను చేజిక్కించుకుంది. ఏడాదికి రూ.222 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. మిగిలిన దిగ్గజ సంస్థలు..రూ.రెండు వందల కోట్లలోపే బిడ్లను దాఖలు చేశాయి. అంతకు ముందు ఉన్న ఒప్పందం ప్రకారం.. వీవో ఏటా రూ.440 కోట్లకుపైగానే చెల్లించాల్సి ఉంది. వీవో తప్పుకోవడం వల్ల..రూ. 220 కోట్ల వరకూఐపీఎల్‌కు నష్టం వచ్చినట్లయింది.

అయితే.. ఐపీఎల్ నష్టం సంగతేమో కానీ.. అసలు డ్రీమ్ 11 సంస్థ ఏమిటి అన్న చర్చ ప్రారంభమయింది. బెట్టింగ్ కంపెనీ అని కొందరు … ఆన్ లైన్ గేమింగ్ కంపెనీ అని మరికొందరు చెబుతున్నారు.. అంతిమంగా ఆ సంస్థ.. ఆన్ లైన్ గేమ్స్‌ను మనీతో ఆడుకునేలా చేస్తుంది. దీని ద్వారా వందల కోట్ల ఆదాయాన్ని ఆ కంపెనీ అందుకుంటోందని.. అందుకే.. ఒక్క టైటిల్ స్పాన్సర్ షిప్‌కే రూ.222 కోట్లు పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. అయితే… ఈ వివాదం మాత్రమే కాదు.. అసలు డ్రీమ్ 11 సంస్థ వెనుక చైనా ఉందనే ప్రచారం ఊపందుకుంది. చైనాకు చెందిన టెన్సెంట్ అనే సంస్థ..వీడియో గేమింగ్ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. ఆ పెట్టుబడులు డ్రీమ్ 11 కంపెనీకి వచ్చాయని తెలుస్తోంది.

డ్రీమ్11కు ఆర్థిక వనరులను సమకూర్చిన సంస్థల్లో టెన్సెంట్ హోల్డింగ్స్ సంస్థ ఒకటి . చైనా మొబైల్ కంపెనీ వివో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి ఈ సీజన్ వరకూ తప్పుకోవడానికి కారణం చైనా కంపెనీ కావడమే. ఇప్పుడు ఓ చైనా కంపెనీ పోయి.. మరో చైనా కంపెనీ వచ్చినట్లయిందని..సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇప్పుడు బీసీసీఐ మళ్లీ కొత్త స్పాన్సర్ వేట కోసం వెళ్తుందో.. లేకపోతే.. విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకెళ్తుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close