ఎస్ అంటే సిగ్గు.. ఎస్ అంటే సూప‌ర్ హిట్టూ

ఎస్‌.ఎస్‌. త‌మ‌న్‌.. గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏముంది?? అయితే త‌మ‌న్ పేరుకి చిరంజీవి ఓ స‌రికొత్త నిర్వ‌చ‌నం ఇచ్చాడు. ఎస్ అంటే సిగ్గు.. ఎస్‌… అంటే సూప‌ర్ హిట్టూ అని. అల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన శ్రీ‌ర‌స్తు – శుభ‌మ‌స్తు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సంద‌ర్భంగా చిరు మాట్లాడుతూ త‌మ‌న్ సంగీతం గురించి ప్ర‌స్తావించాడు. ఓవైపు మెచ్చుకొంటూనే మ‌రోవైపు చుర‌క‌లు అంటించాడు. త‌మ‌న్ పాట‌లు ముందు విన్న‌ప్పుడు ఏం అర్థం కాలేద‌ని, సాహిత్యం న‌లిగిపోతోంద‌న్న భావన క‌లిగింద‌ని, అయితే త‌మ‌న్ పాట‌లు విన‌డం ఓ వ్య‌స‌నంగా మార్చేశాడ‌ని, త‌మ‌న్ వెళ్తున్న దారి క‌రెక్టేన‌ని అన్నాడు.

అంతేకాదు….. త‌న 151వ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌నే అని స్టేజీపై డిక్లేర్ చేశాడు. ”ట్యూన్లు బాగుంటే నువ్వే నా 151 వ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. కావాలంటే ఇప్ప‌టి నుంచే ట్యూన్లు రెడీ చేసుకో” అని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చేశాడు చిరు. దాంతో… త‌మ‌న్ షాకైపోయాడు. చిరు సినిమాలో ఆఫ‌ర్ అంటే మాట‌లా మ‌రి?? మొత్తానికి శ్రీర‌స్తు – శుభ‌మ‌స్తు ఫంక్ష‌న్ ద్వారా చిరుకి త‌న త‌దుప‌రి సినిమా కోసం మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని వెదుక్కొనే శ్ర‌మ త‌ప్పింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close