చిరంజీవికి లేని ధైర్యం.. ఆయనకు ఎలా వచ్చిందో?

మెగాస్టార్‌చిరంజీవి కూడా ఎన్నడూ ధైర్యంగా అంత గొప్ప డైలాగు వేయలేదు. రాజకీయాల్లో తాను కేంద్ర సహాయమంత్రి పదవిని వెలగబెట్టినా కూడా.. ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా కీలకంగా ఉన్నప్పటికీ కూడా.. రాజకీయ హోదా పరంగా తనతో సమానమైన మరో కాంగ్రెస్‌ మాజీ కేంద్ర సహాయ మంత్రి చింతామోహన్‌ చెప్పినంత ధైర్యంగా కనీసం ఒక మాట చెప్పలేకపోయారు. ఇంతకూ ఏమిటా మాట? చింతా ఏం చెప్పారు? అని ఆలోచిస్తున్నారు కదా? అదే మరి… పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, వైకాపా అధినేత జగన్‌మోహన రెడ్డి లను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తాం అంటూ చింతా మోహన్‌ చాలా ధాటిగా సెలవిచ్చారు.
తిరుపతికి చెందిన మాజీ ఎంపీ చింతా మోహన్‌ కామెడీ నిర్ణయాలు తీసుకోవడం, కామెడీ డైలాగులు వల్లిస్తూ ఉండడంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న నాయకుల్లో ఒకరు. ఢిల్లీ పార్టీ వర్గాల్లో లాబీయింగ్‌చేయగల నైపుణ్యం అలవడిపోయిన నేపథ్యంలో.. తాను ఎన్నడూ ప్రజల మధ్య మెలగకపోయినా.. ఢిల్లీ పార్టీ నిర్ణయాలను సైతం తిరుపతి నుంచి శాసిస్తూ ఉండే స్థాయిలో ఆయన చక్రం తిప్పుతుంటారు. గతంలో కేంద్ర సహాయమంత్రిగా కూడా పనిచేసిన ఆయనకు ఢిల్లీ సంబంధాలు బాగానే ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సర్వనాశనం అయిపోయి కునారిల్లుతూ ఉంటే.. చింతా మోహన్‌ మాత్రం.. కొన్నాళ్లకే తాము పునరుజ్జీవం చెందినట్లుగా భావించి.. తిరుపతి ఎమ్మెల్యే హఠాన్మరణం నేపథ్యంలో ఆయన భార్య తెదేపా తరఫున ఎన్నికల్లో దిగితే.. ఏకగ్రీవం కాకుండా పోటీ పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా మొత్తుకున్నా వినకుండా ఆయన పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపి.. కనీసం డిపాజిట్‌ కూడా సాధించలేక మళ్లీ పార్టీ పరువుతీశారు.
అలాంటి చింతామోహన్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీని తనదైన వ్యూహాలతో ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. తమ పార్టీకి రాష్ట్రంలో ఇప్పుడు బలమైన నాయకత్వం అవసరం ఉన్నది గనుక.. పవన్‌కల్యాణ్‌ను, వైఎస్‌ జగన్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తాం అంటూ ఆయన చాలా ధాటిగా ప్రకటించారు. ఆయన ఏ నమ్మకంతా ఇలాంటి డైలాగు చెప్పారో అర్థం కావడం లేదు.
పవన్‌కల్యాణ్‌ విషయానికి వస్తే.. ఆయన కాంగ్రెస్‌ వ్యతిరేకత అనేది ఒక్కటే తన ఎజెండా అన్నట్లుగా ఎప్పుడు మాట్లాడినా విరుచుకుపడిపోతూ ఉంటారు. స్వయంగా ఆయన అన్న మెగాస్టార్‌ చిరంజీవి కూడా.. రాజకీయంగా నీ దారి వేరు, నా దారి వేరు అయినా సరే.. మేం ఇద్దరం ఎప్పటికీ ఒక్కటే అంటూ డొంకతిరుగుడు జస్టిఫికేషన్‌ ఇస్తుంటారే తప్ప… పవన్‌కల్యాణ్‌ను కూడా కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తా అనే స్థాయిలో ఎన్నడూ ధైర్యం చేయలేదు. అలాంటిది చింతా మోహన్‌ మాత్రం చాలా తేలిగ్గా వారిని ఆహ్వానిస్తాం అనేయడం జనానికి నవ్వు తెప్పిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close