రంగ‌స్థ‌లం.. చిరుకి నచ్చ‌లేదా?

రామ్ చ‌ర‌ణ్ – సుకుమార్‌ల సినిమా టైటిల్ ఏంట‌న్న విష‌యంలో సంసిగ్థానికి తెర ప‌డింది. ఈ సినిమాకి ‘రంగ స్థ‌లం’ అనే టైటిల్ ఖారారు చేశారు ఈ మ‌ధ్యే. ఈ టైటిల్‌పై మిశ్ర‌మ స్పంద‌న వినిపించి, చివ‌రికి స‌ర్దుకొంది. రామ్ చ‌ర‌ణ్ సినిమాకి అలాంటి టైటిల్ ఏంటి?? డ‌బ్బింగ్ సినిమా టైటిల్లా ఉంది.. అని కొంద‌రంటే, కొత్త‌గా అనిపించింద‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ టైటిల్ కే అల‌వాటు ప‌డిపోవ‌డం మొద‌లెట్టారు. అయితే.. ఈ టైటిల్‌ని ఓకే చేయించ‌డానికి సుకుమార్ చాలా క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింద‌ట‌. మ‌రీ ముఖ్యంగా చిరు ద‌గ్గ‌ర గ్రీన్ సిగ్న‌ల్ అందుకొనే విష‌యంలో త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింద‌ట‌. చిరు కూడా ”రంగ స్థ‌లం టైటిల్ మ‌రీ ఓల్డ్ గా ఉంది క‌దా” అనేశాడ‌ట‌. అయితే సినిమా కాన్సెప్ట్‌ని దృష్టిలో ఉంచుకొన్న సుక్కు… రంగ స్థ‌లం టైటిల్ ఎందుకు పెట్టాల్సివ‌చ్చిందో చిరుకి వివ‌రించాడ‌ట‌. చిరు మ‌న‌సు చివ‌రి వ‌ర‌కూ ‘ప‌ల్లెటూరి మొన‌గాడు’పైనే ఉంద‌ని తెలుస్తోంది. అంత‌గా కాదంటే.. త‌న పాత సినిమాల టైటిళ్ల‌లో ఈ క‌థ‌కు యాప్ట్ అయ్యే టైటిల్ ఒక‌టి ఎంచుకోమ‌న్నాడ‌ట‌. అయితే సుక్కు మాత్రం చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ ప‌ట్టిన ప‌ట్టు వీడ‌లేద‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యంలో రామ్ చ‌ర‌ణ్ కూడా సుక్కే కే స‌పోర్ట్ చేశాడ‌ట‌. ”టైటిల్ కొత్త‌గా ఉండాలి. ఎవ‌రూ ఊహించ‌ని టైటిల్ తో షాక్ ఇద్దాం” అన్నాడ‌ట‌. చివ‌రికి చిరు కూడా ‘గో ఎహెడ్‌’ అన‌డంతో.. ‘రంగ‌స్థ‌లం’ టైటిల్ ఖ‌రారైపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com