పవన్-చిరు మీటింగ్…అంత లేదప్పా….కేవలం కలెక్షన్స్ కోసమే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ ఎంపి చిరంజీవి చాలా కాలం తర్వాత కలిశారు. ఇద్దరూ కూడా రాజకీయంగా తీసుకోబోయే స్టెప్స్ గురించి మాట్లాడుకున్నారు, పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం, భవిష్యత్ వ్యూహాల గురించి చర్చించారు, చిరంజీవి రాజకీయ భవిష్యత్ గురించి కూడా మాట్లాడుకున్నారు, రాజ్యసభ పదవీ కాలం ముగిసేనాటికి చిరంజీవి కూడా టిడిపిలోకి జంప్ చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో వీళ్ళిద్దరి కలయికకు గొప్ప ప్రాధాన్యముందని బోలెడన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చిరంజీవి, పవన్‌ల కలయికకు రాజకీయాలకు సంబంధం ఉండే అవకాశమే లేదు. అసలు అక్కడ కలిసింది కూడా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు టాప్ రేంజ్ సినిమా హీరోలు అంతే.

గత రెండు సంవత్సరాలుగా తెలుగు సినిమా ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. స్టార్ ఢంకి వ్యాల్యూ తగ్గిపోతూ ఉంది. సినిమా నచ్చిందా? లేదా? అనేదే ప్రయార్టీ అవుతోంది. అందుకే స్టార్ హీరోస్ అందరికంటే కూడా రాజమౌళి సినిమాలకు సూపర్ క్రేజ్ వస్తోంది. బిజినెస్, కలెక్షన్స్ రికార్డ్స్ అన్నీ కూడా ఆయన పేరు మీదే ఉన్నాయి. ఆ రికార్డ్స్‌ని బ్రేక్ చేసే సత్తా తెలుగులో ఉన్న ఏ ఒక్క స్టార్ హీరోకీ లేదన్నది వాస్తవం. అయితే రాజమౌళి సాధించిన భారీ విజయాలు కాస్తా మెగా ఫ్యామిలీ నంబర్ వన్ కిరీటం కాస్త డ్యామేజ్ అయ్యేలా చేశాయి. మెగా కాంపౌండ్ ఆలోచలన్నీ కూడా ఓ మంచి కమర్షియల్ హిట్ కొట్టడానికి బ్రహ్మాండంగా పనికొస్తాయి. కానీ అద్భుతమైన కథలు, అన్ని వర్గాలు ప్రేక్షకులూ ఎగబడి చూసే రేంజ్ సినిమాలు వచ్చే అవకాశమైతే చాలా చాలా తక్కువ. ఓవర్సీస్ ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్, క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులు కూడా ఓ మామూలు మాస్ మసాలా హిట్‌ని ఆరాధించే పరిస్థితులు ఇప్పుడు లేవు. అందుకే చిరంజీవి-రామ్ చరణ్‌లు కలిసి నటించినప్పటికీ, బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి బ్రహ్మాండమైన పబ్లిసిటీ చేసినప్పటికీ ‘బ్రూస్ లీ’ సినిమాకు కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాలేదు.

పవన్‌తో విభేదాలున్నాయని జరిగిన ప్రచారం కూడా ఆ డిజాస్టర్‌కి ఒక ప్రధాన కారణమైందని చిరంజీవి గట్టి నమ్మకం. అందుకే బ్రూస్ లీ రిలీజ్ అయిన వెంటనే మీడియాకు, ప్రపంచానికి తెలిసేలా ఇద్దరు అన్నదమ్ములు, రామ్ చరణ్ కూడా కలిసి మాట్లాడుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిన్న దీపావళి రోజు మెగా హీరోల గ్రూప్ ఫొటోలో కూడా పవన్ లేడు. ఆ విషయాన్ని కొంతమంది హైలైట్ చేశారు. అతి త్వరలో చరణ్ ధృవ సినిమా, అలాగే సంక్రాంతికి ఖైదీ నంబర్ 150 సినిమాలు కూడా ఉండడంతో… మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ సారి పకడ్బంధీగా ప్లాన్ చేస్తోంది. చరణ్, చిరంజీవిల సినిమాలు కూడా ఎనభై-వంద కోట్ల కలెక్షన్స్ రేంజ్‌కి వెళ్ళాలంటే ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఆ సినిమాల రిలీజ్‌ టైంకి లోపే పవన్‌తో మాకు ఎలాంటి విభేదాలు లేవు అన్న క్లియర్ మెస్సేజ్ పంపించాలని ఫిక్స్ అయ్యారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక్కటే. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకుని చిరంజీవి, చరణ్‌ల సినిమాలను కూడా ఎంకరేజ్ చేయండి. కలెక్షన్స్ రేంజ్ పెరిగేలా చూడండి అన్న మెస్సేజ్ ఇవ్వడానికి మాత్రమే ఈ మీటింగ్స్. అంతకుమించి రాజకీయాల గురించి చర్చించే ప్రసక్తే లేదు. రాజ్యసభ పదవీ కాలం పూర్తయ్యే వరకూ, అలాగే 2018లో ఎన్నికల మోడ్ వచ్చేవరకూ శ్రీ చిరంజీవిగారు వేరే పార్టీలోకి జంప్ చేసే అవకాశమే లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close