సునీల్ డాన్సుల‌కు.. చిరు కాంప్లిమెంట్‌

చిరంజీవి డాన్సులు చూసే.. ఈ స్థాయి వ‌చ్చా.. అంటుంటాడు సునీల్‌. ఇప్పుడు ఆ చిరు నే సునీల్ డాన్సుల‌కు కాంప్లిమెంట్ ఇచ్చిన సంద‌ర్భం ఇది. డాన్సుల్లో సునీల్ త‌న‌దైన శైలి చూపిస్తుంటాడు. ఇప్పుడు ఆస్టైల్ చిరంజీవికీ న‌చ్చేసింది. అందుకే ‘మ‌న‌కున్న మంచి డాన్స‌ర్ల‌లో సునీల్ ఒక‌డు’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశాడు చిరు. సునీల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన జ‌క్క‌న్న ఆడియో ఫంక్ష‌న్ కొద్దిసేప‌టి క్రితం హైద‌రాబాద్ లోని శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి చిరు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. త‌న స్పీచ్‌లో సునీల్ ని ప్ర‌సంశ‌ల‌తో ముంచెత్తాడు.

”నా అభిమాని అభివృద్దిలోకి వ‌స్తే త‌ల్లి దండ్రుల త‌ర‌వాత గ‌ర్వించే వ్య‌క్తి నేనే. అభిమానులు కూడా వాళ్ల లైఫ్‌కీ సార్థ‌క‌త ఏర్ప‌ర‌చుకోవాలి. వాళ్లూ అభివృద్దిలోకి రావాలి. అలాంటి అభిమానుల్ని చూసి గ‌ర్వ‌ప‌డుతుంటా. అలాంటి వాళ్ల‌లో నెంబ‌ర్ వ‌న్‌.. సునీల్‌. ఎంతో మందికి సునీల్ స్ఫూర్తినిచ్చాడు. సినిమాపై ప్రేమ‌, క‌సి ఉంటే.. క‌ష్టాన్ని న‌మ్ముకొంటే త‌ప్ప‌కుండా నిల‌బ‌డ‌తారు అన‌డంలో సునీల్ పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఈమ‌ధ్య కాలంలో త‌న‌కు తానుగా ఎలా ఫిజిక‌ల్‌గా ఎలా మార్చుకొన్నాడో చూస్తుంటే ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. ఇది వ‌ర‌కు చాలా పుష్టిగా ఉండేవాడు. త‌ర‌వాత బాడీ బిల్డ‌ర్ గా మారాడు. మాన‌వ సాధ్య‌మా అనిపిస్తుంది. క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేనిది ఏదీ లేదు.. అని నిరూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌.. మ‌న‌కున్న బెస్ట్ డాన్స‌ర్ల‌లో సునీల్ ఒక‌డు. ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం సునీల్ కోస‌మే వ‌చ్చా. తాను నాపై చూపించే ఆప్యాయ‌త అలాంటిది” అంటూ సునీల్‌పై త‌న‌కున్న అభిమానం బ‌య‌ట‌పెట్టాడు చిరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close