జగన్ తో భేటీ వివరాలను వెల్లడించిన చిరంజీవి

సర్వత్రా ఆసక్తి కలిగించిన జగన్ చిరంజీవి భేటీ ముగిసింది. భేటీ అనంతరం ఎయిర్ పొర్టులో చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించి భేటీ వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

ముందుగా ఈ పండుగ సందర్భంగా లంచ్ కి ఆహ్వానించి ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా, కొసరి కొసరి వడ్డించిన జగన్ దంపతులకు చిరంజీవి కృతజ్ఞతలు తెలియ జేశారు. ‌ అయితే జగన్ మోహన్ రెడ్డి సామాన్యుడి కి వినోదం అందించాలన్న ఉద్దేశంతో ఉన్నారని, టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలన్న కృత నిశ్చయంతో ఉన్నారని , అది మంచిదేనని అభినందించిన చిరంజీవి, తమ వైపు ఉన్న కష్టాలను కూడా ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలియజేశారు.

పరిశ్రమ అంటే పూల పాన్పు కాదని, రెక్కాడితే తప్ప డొక్కాడని వేల మంది కార్మికులు సినిమా పరిశ్రమలో ఉంటారని, లాక్ డౌన్ సమయం లో తామంతా కొన్ని నెలల పాటు వారికి నిత్యవసర వస్తువులు అందించామని గుర్తు చేసిన చిరంజీవి, ఇటువంటి కార్మికుల సమస్యలే కాకుండా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మరియు నిర్మాతల సమస్యలు కూడా ముఖ్య మంత్రి కి వినిపించినట్లు దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. అన్ని వైపులా ఆలోచించి అందరినీ సమదృష్టితో చూసి, సినీ పరిశ్రమకు అనుకూలంగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారన్న భరోసా సీఎం ఇచ్చారని చిరంజీవి తెలియజేశారు. మరొకవైపు జీవో 35 నీ తిరిగి పరిశీలించి, సవరించి పరిశ్రమకు అనుకూలంగా ఉండేలా జీవో తీసుకు వచ్చే అవకాశం ఉందని, ఆ నమ్మకం తనకుందని చిరంజీవి తెలియజేశారు. బెనిఫిట్ షో ల విషయంలో కూడా సీఎం సానుకూలం గా స్పందించారని అన్నారు చిరంజీవి.

మరో వారం పది రోజుల లోపు పరిశ్రమ కు అనుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ లోపు పరిశ్రమ కు సంబంధించిన వ్యక్తులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం వంటివి చేయకుండా సంయమనం పాటించాలని పరిశ్రమ కు సూచించారు చిరంజీవి. అదే విధంగా త్వరలోనే ఈ సమస్యలన్నింటికీ ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పిన చిరంజీవి అవసరమైతే త్వరలోనే పరిశ్రమ పెద్దలతో కలిసి మరొక సారి ముఖ్య మంత్రి తో భేటీ అవుతానని వ్యాఖ్యానించారు

సినీ పరిశ్రమ నుండి ఈ భేటీ పట్ల ఎటువంటి స్పందన వస్తుంది అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close