చిరంజీవి బీజేపీ చేరికపై సంచలన కథనం: మెగాస్టార్ వివరణ

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ చిరంజీవి భారతీయ జనతాపార్టీలో చేరతారని, సోదరుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి రానున్న కాలంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలకు సమాంతరంగా బలమైన రాజకీయశక్తిగా ఎదగబోతున్నారని కొద్దికాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు సంప్రదాయ మీడియాలో కూడా తొలిసారిగా ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఇవాళ ఇదే అంశంపై ఓ సంచలన కథనాన్ని ఇచ్చింది.

మార్చి 6న రాజమండ్రిలో జరిగే బీజేపీ బహిరంగసభలో అమిత్ షా సమక్షంలో చిరంజీవి కాషాయ కండువా కప్పుకోనున్నారని నమస్తే తెలంగాణ రాసింది. ఏపీలో సొంతంగా ఎదగాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ ‘కాపులకు ముఖ్యమంత్రి పదవి’ అనే నినాదంతో చిరంజీవిని తమవైపు తిప్పుకోవాలని చూసోందని పేర్కొంది. ఇటు చిరును పార్టీలోకి చేర్చుకుని, అటు పవన్ జనసేనతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ వ్యూహాలు పన్నుతోందని రాసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాపు కులానికే చెందిన సోము వీర్రాజును ప్రకటించి, చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇచ్చి కాపులను పూర్తిగా తమవైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనబడుతోందని పేర్కొంది.

బీజేపీలో చేరిక ఊహాగానాలపై చిరంజీవి ఎట్టకేలకు స్పష్టత ఇచ్చారు. పార్టీ మారే ఆలోచన లేదని, తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని స్పష్టీకరించారు. రాజకీయాలలో ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై సాగుతున్న రకరకాల ఊహాగానాలను ఖండిస్తున్నానని, వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. కొందరు కావాలనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ జుబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో చిరంజీవి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు బీజేపీలో చేరికపై అడగగా, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై విధంగా స్పందించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close