‘సైరా’ స్క్రిప్టులో మార్పులు??

చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ కి అర్థాంత‌రంగా బ్రేక్ ప‌డింది. ప‌ది రోజుల పాటు హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం.. ఆ త‌ర‌వాత ఆగిపోయింది. దాంతో ‘సైరా’లో భారీ మార్పులు జ‌రుగుతున్నాయ‌ని, ద‌ర్శ‌కుడు కూడా మ‌రిపోతున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ‘సైరా’ టీమ్‌లో సురేంద‌ర్ రెడ్డి స్థానానికి వ‌చ్చిన ఢోకా ఏమీ లేదు. కాక‌పోతే స్క్రిప్టులో మార్పులు మాత్రం జ‌రుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా డైలాగ్స్ విష‌యంలో చిరంజీవి చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధ‌వ్ ర‌చ‌యిత‌. ఇప్ప‌టికే ఆయ‌న దాదాపుగా డైలాగుల‌న్నీ రాసేశారు. కానీ చిరంజీవి మాత్రం వాటికి ఫైన్ ట్యూన్ ఇవ్వ‌మ‌ని అడిగార‌ట‌. ప్ర‌స్తుతం సాయిమాధ‌వ్ బుర్రా, స‌త్యానంద్‌, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌లిసి మ‌రోసారి డైలాగుల విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార్ట‌. ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’లో బుర్రా రాసిన‌ డైలాగులు చిరంజీవికి బాగా న‌చ్చాయ‌ని, ఆ స్థాయిలో డైలాగులు రాయాల‌ని సూచించార‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప‌ది రోజులు షూటింగ్ సాగిన సంగ‌తి తెలిసిందే. ఆయా సన్నివేశాల‌న్నింటికీ ప‌క్కన పెట్టి మ‌ళ్లీ రీషూట్ చేయ‌బోతున్నారు. అంటే…’సైరా’కి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క సీన్ కూడా తీయ‌లేద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.