మెగా స్టార్ 150వ సినిమాకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ మెగా ఫ్యామిలీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అవకముందే ఈ ల్యాండ్ మార్క్ ఫిల్మ్‌కి రావాల్సిన బజ్‌ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక సినిమా ప్రారంభం అయిన తర్వాత నుంచి పొలిటికల్ లీడర్ చిరంజీవిని మెగాస్టార్ చిరంజీవిగా జనాలకు అలవాటు చెయ్యడంలో కూడా సూపర్బ్‌గా సక్సెస్ అయ్యారు. ఇంద్ర, ఠాగూర్ సినిమాల నాటి లుక్‌లో చిరంజీవి కనిపిస్తున్నాడు. గ్లామర్, గ్రేస్ అన్నీ కూడా మెగాస్టార్ రేంజ్‌లోనో కనిపిస్తున్నాయి. చిరంజీవి కూతురు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌కి కూడా మంచి పేరే వస్తోంది. చిరంజీవి లుక్స్, గ్లామర్, ఫైట్స్, యాక్టింగ్‌కి సంబంధించిన అన్ని విషయాలను పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో జనాలకు అలవాటు చేసేసింది మెగా ఫ్యామిలీ. ఫిల్మ్ ఈవెంట్స్‌లో చూపించిన డ్యాన్స్ మూవ్స్‌తో తన డ్యాన్సింగ్ స్కిల్స్‌లో కూడా క్వాలిటీ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు చిరంజీవి. ఇప్పుడిక ఫైనల్‌గా చిరు-కాజల్ పెయిర్ని ప్రేక్షకులకు అలవాటు చేయడం ఎలా అనే విషయాన్ని చిరు అండ్ కో ప్లాన్ చేస్తున్నారు.
బాలకృష్ణతో సహా ఇంతకుముందు యంగ్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసిన అందరు హీరోలు కూడా రెగ్యులర్‌గా సినిమాలు చేసినవాళ్ళే. చిరంజీవి కూడా రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూ ఉండి ఉంటే ఇది అసలు సమస్యే అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం నాగబాబుకు కూతురిగా, పవన్, బన్నీ, చరణ్‌లకు లవర్‌గా యాక్ట్ చేసిన కాజల్‌తో చిరు పెయిర్ ఎలా ఉండబోతుంది? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే విషయాల్లో మెగావారికి కూడా డౌట్స్ ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. హీరోయిజం బిల్డప్ వేషాల కంటే కూడా విషయమున్న సినిమాలనే కాస్త ఎక్కువ ఇష్టపడుతున్నారు. చిరంజీవితో కాజల్ లవ్‌లో పడడం, ఇద్దరి మధ్యా లవ్ సీన్స్, డ్యూయట్ సాంగ్స్ అంటే అలాంటి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అన్న టెన్షన్స్ మెగావారికి ఉన్నాయని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు చిరంజీవి, కాజల్ పెయిర్ని ప్రేక్షకులకు అలవాటు చేయడం కోసమే స్పెషల్‌గా పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. చిరు, కాజల్‌ల టీజర్‌తో పాటు కొన్ని స్టిల్స్ కూడా స్పెషల్‌గా డిజైన్ చేస్తున్నారట. ఈ ఒక్క విషయంలో కూడా పాజిటివ్ రెస్సాన్స్ వచ్చిందంటే మాత్రం మెగాస్టార్‌కి సంబంధించినంతవరకూ అన్నీ శుభాలే అనుకోవచ్చు. చిరంజీవి లేటెస్ట్ స్టిల్స్ చూస్తుంటే ఈ విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి డిస్టింక్షన్లో పాస్ అయ్యేలానే కనిపిస్తున్నాడు. ఎంతైనా హార్డ్ వర్క్, ప్లానింగ్‌కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా…..ఏ బ్యాక్ గ్రౌండూ లేకపోయినా నంబర్ ఒన్ హీరోగా ఎదిగిన మెగాస్టార్‌ని తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ అలవాటు చేయడం పెద్ద విషయమా?