త‌మ్ముడి కోసం చిరు వ‌స్తున్నాడోచ్‌

చిరంజీవి – ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌మ‌ధ్య కోల్డ్ వార్‌కి మొన్నామ‌ధ్యే తెర ప‌డింది. బ్రూస్లీ ప్ర‌మోష‌న్ కోసం… రామ్‌చ‌ర‌ణ్ ప‌వ‌న్‌చుట్టూ తెగ తిరిగాడు. ఏడేళ్ల త‌ర‌వాత అన్న‌య్య న‌టించినందుకు ఆనందంగా ఉంది.. అంటూ ప‌వ‌న్ కూడా గ‌బ్బ‌ర్ సింగ్ వేషంలో అన్న‌య్య ఇంటికి స్వ‌యంగా వెళ్లి క‌లుసుకొని వ‌చ్చాడు. అప్ప‌టి నుంచీ అన్నాద‌మ్ముల మ‌ధ్య‌.. మ‌ళ్లీ బంధం విక‌సించింది. ఇప్పుడు త‌మ్ముడి ఆడియో ఫంక్ష‌న్‌కి అన్న‌య్య చిరంజీవి చీప్ గెస్ట్‌గా రావ‌డం కూడా ఖాయ‌మైపోయిన‌ట్టు టాక్‌.

ఈనెల 20న హైద‌రాబాద్‌లోని నోవెటెల్ హోట‌ల్‌లో స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించ‌బోతున్నారు. గ‌త కొన్నేళ్లుగా ప‌వ‌న్ ఫంక్ష‌న్ల‌కు చిరంజీవి రావ‌డ‌మే మానేశారు. స‌ర్దార్‌తో మ‌ళ్లీ… ఆ సంప్ర‌దాయానికి తెర లేవ‌నుంది. ప్ర‌స్తుతం దిల్లీలో ఉన్నాడు చిరంజీవి. అత‌ని కోసం నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ దిల్లీ బ‌య‌ల్లేరారు. ప‌వ‌న్ ఫంక్ష‌న్‌కి రావాల్సిందిగా ఆహ్వానించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అటు రాజ‌కీయాలు, ఇటు శ్రీ‌జ పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నారాయ‌న‌. అయినా స‌రే.. త‌మ్ముడి కోసం స‌మ‌యం కేటాయించ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు టాక్‌. చిరంజీవి రావ‌డం ఖాయ‌మ‌ని, ఒక‌వేళ రాక‌పోతే కేవ‌లం స‌ర్దార్ బ్యాచ్‌తోనే ఆడియో ఫంక్ష‌న్ నిర్వ‌హించాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ట‌. మొత్తానికి మెగా బ్ర‌ద‌ర్స్‌ని చాలా కాలం గ్యాప్ త‌ర‌వాత‌ ఒకే వేదిక‌పై చూడ‌బోతున్నాం. మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com