ఊటీలో ‘గాడ్ ఫాద‌ర్‌’

మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన సినిమా `లూసీఫ‌ర్‌`. తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌` పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ఊటీలో ప్రారంభ‌మైంది. ప్ర‌ధాన పాత్ర‌ల‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. ఈ రోజు నుంచి దాదాపు రెండు వారాల పాటు నిరంత‌రాయంగా షెడ్యూల్ కొన‌సాగే అవ‌కాశంఉంది. చిరు సెట్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి. మ‌ల‌యాళం `లూసీఫ‌ర్‌`ని తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచి, చిరంజీవి ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా కొన్ని కీల‌క‌మైన మార్పులు చేశారు. ఈ చిత్రంలో మ‌రో క‌థానాయ‌కుడికీ చోటుంది. అయితే అది అతిథి పాత్ర‌. ఆ పాత్ర‌లో స‌ల్మాన్ ఖాన్ కనిపిస్తాడ‌ని ఓ ప్ర‌చారం. అయితే… చిత్ర‌బృందం ఈ విష‌యంపై స్పందించ‌డం లేదు. కేవ‌లం రెండు మూడు రోజుల కాల్షీట్లు ఇస్తే చాలు. ఆ పాత్ర రెడీ అయిపోయింది. సినిమా చివ‌ర్లో ఆ సీన్లు తీసుకున్నా ఓకే. అందుకే ఈ పాత్ర విష‌యంలో చిత్ర‌బృందం ఏమాత్రం తొంద‌ర ప‌డ‌డం లేదు. ఈ చిత్రంలో చిరు గెట‌ప్‌, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా వైవిధ్యంగా క‌నిపించ‌బోతున్నాయ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంజాయి కట్టడికి కేసీఆర్ స్పెషల్ ఆపరేషన్ !

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. ఏపీలోని విశాఖ మన్యం నుంచే గంజాయి దేశం మొత్తం రవాణా అవుతోందని ఐదారు రాష్ట్రాల పోలీసులు వస్తున్నారని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే చెబుతున్నారు....

చేతకాని దద్దమ్మలే తిడతారన్న సజ్జల !

ఏదైనా తమ దాకా వస్తే కానీ దెబ్బ రుచి తెలియదన్నట్లుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంత కాలం ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ నేతల్ని అమ్మనా బూతులు...

బ్రేకింగ్ : కోర్టు మెట్లెక్కిన సమంత

సమంత కోర్టుని ఆశ్రయించింది. తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేసింది. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్‌...

‘ఆర్య’ని మారిస్తే ‘అల్లు’ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ?

'ఆర్య'.. తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ పరిచయం చేసిన హీరోయిక్ పాత్ర. ఆర్య సినిమాతోనే అల్లు అర్జున్ తొలి కమర్షియల్ విజయం దక్కింది. ఆర్యతోనే సుకుమార్ అనే దర్శకుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు....

HOT NEWS

[X] Close
[X] Close