చిరు కోసం రంగంలోకి దిగిన మైత్రీ మూవీస్‌

క్రేజీ సినిమాల‌కు కేరాఫ్‌గా మారింది మైత్రీ మూవీస్‌. ఇప్పుడున్న స్టార్ హీరోలంద‌రితోనూ మైత్రీ సినిమాలు తీసింది. అయితే… అప్ప‌టి మూల‌స్థంభాలైన చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌ల‌తో మైత్రీ ప‌నిచేయ‌లేదు. ఇప్పుడు ఆలోటు కూడా తీర్చుకోవాల‌ని చూస్తోంది మైత్రీ. ముందుగా వాళ్ల దృష్టి చిరంజీవిపైనే ప‌డింది. చిరుతో ఓ సినిమా చేయాల‌ని, లేదంటే.. రాబోయే సినిమాల్లో అయినా, ఓ పార్ట్ అవ్వాల‌ని మైత్రీ భావిస్తోంది.

ఇప్ప‌టికే మైత్రీ చాలా మంది ద‌ర్శ‌కుల‌కు అడ్వాన్సులు ఇచ్చింది. వాళ్ల‌తో చిరుకి స‌రిపోయే క‌థ గురించి చ‌ర్చ‌లు సాగిస్తున్న‌ట్టు తెలుస్తోంది. `రంగ‌స్థ‌లం` సినిమాతో మైత్రీ నిర్మాత‌లు చిరు కుటుంబానికి బాగా ద‌గ్గ‌రయ్యారు. ఆ స‌మ‌యంలోనే చిరు – మైత్రీల సినిమా ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు దానిపైనే మైత్రీ కూడా క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని స‌మాచారం. సుకుమార్ మైత్రీకి ఆస్థాన ద‌ర్శ‌కుడు అయిపోయాడు. త‌న‌కీ చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని కోరిక‌. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే.. చిరు – సుకుమార్ – మైత్రీ… ఈ కాంబో చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close