నాకు మ‌రో త‌మ్ముడు, శిష్యుడు దొరికాడు: చిరు

ప్రేమించేవాళ్ల‌ని అభిమానుల్ని సంపాదించుకోవ‌డం బ్యాంకు బెలెన్సులు పెంచుకోవ‌డంతో స‌మాన‌మ‌న్నారు చిరంజీవి. ఈరోజు హైద‌రాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జ‌రిగిన ‘అర్జున్ సుర‌వ‌రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. నిఖిల్‌ని చూస్తే, త‌నకు మ‌రో త‌మ్ముడు, శిష్యుడు దొరికినంత ఆనందంగా ఉంద‌ని, అభిమాన ధ‌న రూపంలో త‌న బ్యాంకు బాలెన్స్ నిఖిల్ మ‌రింత పెంచాడ‌ని చ‌మ‌త్క‌రించారు చిరు. ఈ సినిమా తాను చూశాన‌ని, బాగా న‌చ్చింద‌ని, ఈ త‌రం చూసి, తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇందులో ఉన్నాయ‌ని, చెగోవెరాకి సంబంధించిన పాట చూస్తున్న‌ప్పుడు త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తొచ్చాడ‌న్నారు.

“సోష‌ల్ మీడియా బాగా పెరిగింది. ఇంటర్నెట్ తో మ‌మేకం అవుతున్నాం. అయితే మ‌న స‌మాచారాన్ని, మ‌ర ర‌హ‌స్యాల్ని మ‌న‌మే బ‌హిర్గ‌తం చేసుకుంటున్నాం. సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసినా, మ‌న కెమెరా ద్వారా మ‌న బెడ్ రూమ్‌లో ఏం జ‌రుగుందో ఇత‌రులు తెలుసుకోగ‌లుతున్నారు. ఇంత ప్ర‌మాద‌క‌ర‌మైన స్థాయిలో మ‌నం ఉన్నాం. ఈ విష‌యాల‌న్నింటినీ ఈ సినిమా ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌వ‌ర్ బోయ్ గా న‌టించిన నిఖిల్ ఈ సినిమాతో యాక్ష‌న్ హీరో అవ‌తారం ఎత్తాడు. లావ‌ణ్య త్రిపాఠి న‌ట‌న బాగుంది. ముఖ్యంగా త‌న న‌వ్వంటే నాకు చాలా ఇష్టం” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close