‘చుట్టాలబ్బాయ్‌’తో ‘ఆటాడుకొందాం’ రా!

గ‌త రెండు నెల‌లుగా బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్డంత సంద‌డి క‌నిపిస్తోంది. సినిమాలు హిట్టా, ఫ‌ట్టా అనేది ప‌క్కన పెడితే.. ప్ర‌తీవారం రెండు మూడు సినిమ‌లొచ్చేస్తున్నాయి. ఈవారం కూడా రెండు సినిమాలు పోటీ ప‌డుతున్నాయి. చుట్టాల‌బ్బాయ్‌గా ఆది, ఆటాడుకొందాం రా అంటూ సుశాంత్ ఢీ కొట్ట‌బోతున్నారు. అటు ఆదికీ, ఇటు సుశాంత్‌కి ఈ సినిమాతో హిట్టు కొట్ట‌డం చాలా అవ‌స‌రం. మ‌రి ఈ రెండు సినిమాల రిపోర్టులూ ఎలా ఉన్నాయి? దేనిపై జ‌నాల ఫోక‌స్ ఎక్కువ‌గా ఉంది?

* చుట్టాల‌బ్బాయ్‌

ప్రేమ కావాలి, ల‌వ్‌లీ సినిమాలు రెండూ డీసెంట్‌గానే ఆడాయి. కానీ… ఆ త‌ర‌వాత ఆది కెరీర్ ఏమాత్రం స్పీడుగా లేదు. సినిమాలు చేస్తున్నా హిట్టు కొట్ట‌లేదు. అందుకే త‌న ఆశ‌ల‌న్నీ ఇప్పుడు చుట్టాల‌బ్బాయ్‌పైనే. నాన్న సాయికుమార్‌తో తొలిసారి క‌ల‌సి న‌టించ‌డం ఈ సినిమాలోని ప్ర‌త్యేక‌త‌. భాయ్‌తో ఓ అట్ట‌ర్ ఫ్లాప్ మూట‌గ‌ట్టుకొన్న వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇది. మాస్‌, కామెడీ, యాక్ష‌న్‌.. ఇలా అన్ని అంశాల్నీ ఇందులో జోడించార్ట‌. క‌థ‌లో ఎలాంటి కొత్త‌ద‌నం లేకున్నా కామెడీ ఎపిసోడ్లు మాత్రం ఆక‌ట్టుకొనేలా వ‌చ్చాయ‌ని టాక్‌. ఫ‌స్టాఫ్ అంతా కామెడీతోనే బండి లాగించేశార్ట‌. సెకండాఫ్ మాత్రం పూర్తిగా గాడిత‌ప్పింద‌ని, ఆదిపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎపిసోడ్లు కుద‌ర్లేద‌ని టాక్‌. దాంతో ఈ సినిమా యావ‌రేజ్ తో గ‌ట్టెక్కొచ్చు అంటున్నారు.

* ఆటాడుకుందాం రా

అడ్డా త‌ర‌వాత చాలా గ్యాప్ తీసుకొని సుశాంత్ చేసిన సినిమా ఇది. ఈసారి కామెడీ బాట‌ని న‌మ్ముకొన్నాడు సుశాంత్‌. కామెడీని తెర‌కెక్కించ‌డంలో సిద్ద‌హ‌స్తుడు జి.నాగేశ్వ‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా క‌థ‌లోనూ కొత్త‌ద‌నం ఏమీ లేక‌పోయినా… కామెడీ సీన్ల‌తో న‌డిపించేశార్ట‌. టైమ్ మిష‌న్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని చెబుతున్నారు. ఆసీన్ల‌న్నీ హిలేరియ‌స్‌గా పేలాయ‌ట‌. సెకండాఫ్ మొత్తం టైమ్ మిష‌న్ నేప‌థ్యంలోనే సాగుతుంద‌ట‌. అయితే ఈ టైమ్ మిష‌న్ ఎపిసోడ్‌కీ క‌థ‌కీ సంబంధం లేద‌ని.. వేరే ట్రాక్‌లా ఉంటుంద‌ని చెబుతున్నారు. అలాంట‌ప్పుడు ఆడియ‌న్స్ ఎలా క‌నెక్ట్ అవుతారో అర్థం కావ‌డం లేదు. అఖిల్‌, చైతూలు గెస్ట్ ఎపీరియ‌న్స్ ఇవ్వడం ఈ సినిమాకి బోన‌స్ అనే చెప్పాలి.

మొత్తానికి రెండు సినిమాల ప్రీ రిలీజ్ టాకూ ఏవ‌రేజ్ అనే చెబుతున్నారు. మ‌రి రిజ‌ల్ట్ మాత్రం.. ఆడియ‌న్స్ చేతుల్లో ఉంది. ఈ రెండు సినిమాల్లో దేనికి ఓటేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close