కోర్టులో రఘురామ ఫోన్..సీఐడీ క్లారిటీ..!

రఘురామకృష్ణరాజు ఇష్యూపై సీఐడీ అధికారులు రెండో సారి ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. కొద్దిరోజుల కిందట.. ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికలో రఘురామకృష్ణరాజు కాలికి గాయాలు ఉన్నట్లు చెప్పలేదని నివేదికను ప్రకటించిన సీఐడీ అధికారులు.. తాజాగా ఆయన ఫోన్ గురించి చేసిన ఆరోపణలపై స్పందించారు. రఘురామకృష్ణరాజు ఫోన్‌ను.. సిమ్‌ను అరెస్ట్ చేసిన రోజే సీజ్ చేశామని ప్రకటించారు. ఈ మేరకు సీజర్ రిపోర్ట్ కూడా తయారు చేశామన్నారు. ఫోన్‌ను సీఐడీ కోర్టులో డిపాజిట్ చేశామని ప్రెస్‌నోట్‌లో తెలిపారు. ఫోన్, సిమ్ అన్నీ సీజ్ చేశామని .. సీఐడీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

ఇప్పుడు అసలు విషయం.. ఆ ఫోన్ నుంచి ఎవరెవరికి సందేశాలు వెళ్లాయో తేలాల్సి ఉంది. రఘురామకృష్ణరాజు ఫోన్ నుంచి.. పీవీ రమేష్ సోదరితో పాటు..ఆయన కుటుంబసభ్యులకు సందేశాలు వెళ్లాయని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. దీంతో ఈ వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది. ఒక్క పీవీ రమేష్ సోదరికే కాదు.. ఇంకా చాలా మందికి సందేశాలు వెళ్లాయని.. రఘురామకృష్ణరాజు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపధ్యంలోనే సీఐడీ పోలీసులు స్పందించినట్లుగా తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు తన ఫోన్ నెంబర్‌ను 9000911111గా చెప్పారని.. ఆ నెంబర్ సిమ్ అందులో ఉందో లేదో తమకు తెలియదని సీఐడీ చెప్పుకొచ్చింది.

నిజానికి.. కేసు నమోదు చేసినప్పుడు.. పోలీసులు నిందితుడితో పాటు.. అతని వద్ద నుంచి తీసుకున్న వస్తువులన్నింటినీ సాక్షుల సమక్షంలో పంచనామా చేసి.. కోర్టులో సమర్పించాలి. ఫోన్ తమ దగ్గరే ఉందని.. సీజ్ చేశామని.. సీఐడీ చెప్పినందు వల్ల.. తదపరి పరిణామాలు వేగంగా సాగే అవకాశం ఉంది. ఈ వ్యవహారం ముందు ముందు సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఫోన్ నుంచి పీవీ రమేష్ సోదరికి సందేశాలు ఎలా వెళ్లాయి… ఎవరు పంపారు.. అసలు ఎప్పుడు సీజ్ చేశారు.. ఎప్పుడు కోర్టుకు సమర్పించారు.. ఎప్పుడు ఆ ఫోన్ నుంచి సందేశాలు వెళ్లాయో.. లెక్క తేలిస్తే.. సీఐడీ అధికారులపై రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణల్లో నిజం నిగ్గుతేలిపోయే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close