భూమా డ్రామా పార్ట్‌ 2 : సాయంత్రానికి క్లారిటీ వస్తుందా?

భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారా లేదా అనే విషయంలో సుదీర్ఘమైన రాజకీయ డ్రామాకు సంబంధించిన పార్ట్‌2 (రెండవ ఎపిసోడ్‌) సోమవారం నాడు ప్రారంభం అయింది. అటు విజయవాడ, ఇటు హైదరాబాదు రెండు లొకేషన్లలో రెండు యూనిట్లతో ఈ ఎపిసోడ్‌ వ్యవహారాలు నడుస్తున్నాయి. మొత్తానికి జగన్‌ రాయబారులు ప్రకటించిన మాటలు ఏ గంగలో కలిసిపోయాయో గానీ.. సోమవారం సాయంత్రానికి భూమా డ్రామా రెండో పార్ట్‌ ఒక క్లారిటీ ఇస్తుందని.. నెక్ట్స్‌ ఎపిసోడ్‌లో క్లయిమాక్స్‌ ఉంటుందని అనుకుంటున్నారు.

సోమవారం నాడు ఏపీ అసెంబ్లీ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సమావేశం ఉండగా.. వైకాపా ఎమ్మెల్యేగా ఈ కమిటీకి అధ్యక్ష పదవిలో ఉన్న భూమా నాగిరెడ్డి ఆ సమావేశానికి వచ్చారు. ఒకవైపు పార్టీ మారుతాడనే ఊహాగానాలు ఎలా ఉన్నా.. వైకాపా ఎమ్మెల్యే హోదాలోనే ఆయన పీఏసీ కమిటీ సమావేశానికి హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. సమావేశం ఆవరణలో కారు దిగి మీడియాతో మాట్లాడకుండా భూమా నేరుగా వెళ్లిపోయారు. అయితే.. కనీసం సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా భూమాను కలిసి.. తెలుగుదేశంలో చేరుతున్నారా? లేదా? ఎప్పుడు? అనే విషయాల్లో సందేహాలు నివృత్తి చేసుకోవాలని మీడియా యత్నిస్తున్నది.

మరోవైపు బెజవాడలో మరో పార్ట్‌ వ్యవహారాలు నడుస్తున్నాయి. కర్నూలుజిల్లా తెదేపా నేతల్లో భూమాకు వైరివర్గం అయినటువంటి శిల్పా సోదరుల్ని పార్టీ అధినేత అక్కడకు పిలిపించారు. మొన్న కర్నూలు జిల్లా నేతలు చంద్రబాబుతో సమావేశం అయిన తర్వాత.. మరికొన్ని భేటీలు అయిన తర్వాత గానీ.. భూమా చేరిక ఖరారు కాదని వారు చెప్పిన సంగతి పాఠకులకు గుర్తుంటుంది. ఆ నేపథ్యంలో వారితో ఈ కొత్త భేటీ జరగడం ఆసక్తికరంగా ఉంది. షెడ్యూలు ప్రకారం వారు ‘తమను ఎందుకు పిలిచారో తెలియదు’ అంటున్నప్పటికీ.. ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో భేటీ అయి, కలెక్టర్ల సమావేశం తర్వాత చంద్రబాబుతోనూ సమావేశం అవుతారు. ఆ భేటీలో ఆయన బుజ్జగింపు పూర్తిచేసి, భూమా రాకకు లైన్‌ క్లియర్‌ చేస్తాడని సమాచారం.

భూమా నాగిరెడ్డి ఆదివారం నాడు చంద్రబాబుతో భేటీ అయి మాట్లాడారు. వివరాలు మాత్రం బయటకు రాలేదు. సోమవారం సాయంత్రం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. అదే సమయానికి రావాల్సిందిగా ఆ నియోజకవర్గానికే చెందిన ఆదినారాయణరెడ్డి శత్రువు రామసుబ్బారెడ్డిని కూడా చంద్రబాబు పిలిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. రామసుబ్బారెడ్డి మాత్రం చివరినిమిషంలోనూ తన అసంతృప్తిని దాచే పనిలేకుండా, అనుచరులతో కలిసే విజయవాడకు బయల్దేరారు. మొత్తానికి సాయంత్రానికి భూమా నాగిరెడ్డి, ఆదినారాయణరెడ్డి ల చేరికలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close