రిలీజ్ డేట్ల విష‌యంలో టాలీవుడ్ లో క్లారిటీ

లాక్ డౌన్ వ‌ల్ల థియేట‌ర్లు మూత‌బ‌డ్డాయి. కొత్త సినిమాల ఊసేలేదు. అయితే ఒక‌వేళ లాక్ డౌన్ ఎత్తేసి, థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇస్తే ఏం చేయాల‌న్న విష‌యంలో తెలుగు నిర్మాత‌లు ఇప్ప‌టికే ఓ నిశ్చిత‌మైన అభిప్రాయానికి వ‌చ్చేశారు. థియేట‌ర్లు తెర‌చుకుంటే, ఒక్క‌సారిగా సినిమాల ఫ్లోటింగ్ మొద‌ల‌వుతుంది. రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించుకుంటారు. విడుద‌ల తేదీ విష‌యంలో నిర్మాత‌ల మ‌ధ్య క్లాష్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. ఈ సంగ‌తి ముందే గ్ర‌హించిన ప్రొడ్యూస‌ర్ గిల్డ్ ఇప్పటికే నిర్మాత‌లకు స్ప‌ష్ట‌మైన సంకేతాల్ని ఇచ్చింది.

ఇది వ‌ర‌కు రిలీజ్‌డేట్లు ప్ర‌క‌టించుకున్న సినిమాల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని గిల్డ్ నిర్ణ‌యించింది. మార్చి, ఏప్రిల్ లో విడుద‌ల కావ‌డానికి కొన్ని సినిమాలు సిద్ధ‌మ‌య్యాయి. రిలీజ్ డేట్లు కూడా ప్ర‌క‌టించుకున్నాయి. థియేట‌ర్లు ఎప్పుడు తెర‌చుకున్నా స‌రే, ముందు ఆ సినిమాల‌కే ప్రాధాన్యం ఇవ్వాల‌ని గిల్డ్ నిర్ణ‌యించింది. సెన్సార్ అయిపోయిన సినిమాల‌కూ ముంద‌స్తు ప్రాధాన్యం ఇస్తారు. ఆ త‌ర‌వాతే మిగిలిన సినిమాలొస్తాయి. ఒకేసారి రెండు మూడు సినిమాలు రావ‌డం వ‌ల్ల నిర్మాత‌ల‌కే ఎక్కువ న‌ష్టం. ప్రేక్ష‌కుల్ని ఆయా సినిమాలు పంచుకోవాల్సివ‌స్తుంది. పైగా లాక్ డౌన్ త‌ర‌వాత ప్రేక్ష‌కుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇలాంటి స‌మ‌యంలో ఒకేసారి సినిమాల‌న్నీ గుంపుగా రావ‌డం కూడా క‌రెక్ట్ కాదు. అందుకే.. ఫ‌స్ట్ క‌మ్స్ ఫ‌స్ట్ ప్రాతిప‌దిక‌పై ముందే రిలీజ్ డేట్ ప్ర‌కటించుకుని, లాక్ డౌన్ వ‌ల్ల ఆగిపోయిన సినిమాలే విడుద‌ల కానున్నాయి. ఈ విష‌యంలో డి.సురేష్ బాబు మాట్లాడుతూ “రిలీజ్ డేట్ల విష‌యంలో అస‌లు మాకు స‌మ‌స్యే లేదు. లాక్ డౌన్ కంటే ముందే పూర్త‌యిపోయిన సినిమాల‌కు తొలి ప్రాధాన్యం. అయితే స‌మ‌స్య ఇప్పుడు రిలీజ్ డేట్ల గురించి కాదు. లాక్ డౌన్ ఎత్తేశాక ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌న్న‌దే ప్ర‌ధానం. వాటిపై ఇప్పుడే ఓ అంచ‌నాకు రాలేం” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close