“ప్లీనరీ”లతోనే వైసీపీ సినిమాపై క్లారిటీ !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉంది కదా మళ్లీ విజయమ్మ వస్తారా అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు వైసీపీ జోడు గుర్రాలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలకు కోపం వచ్చింది. కష్టకాలంలో ఉందని మీరెలా డిసైడ్ చేస్తారని వారు ఫైరయ్యారు. కష్టకాలంలో ఉందో లేదో జర్నలిస్టు ఎందుకు అన్నాడో కనీసం విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నాలో లేదో కానీ.. ప్లీనరీల రూపంలో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా అని వైసీపీ నేతలే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి.

మొహం చాటేస్తున్న క్యాడర్ !

ప్లనరీలు ప్రజల కోసం పెట్టినవి కావు. సొంత పార్టీ క్యాడర్ కోసం పెట్టినవి. నియోజకవర్గ స్థాయి పార్టీ క్యాడర్ అంతా వచ్చి తమ కార్యాచరణపై చర్చించుకునే ప్లీనరీ. కానీ ఎక్కడా ఆ పార్టీ క్యాడర్ ముఫ్పై శాతం కూడా ప్లనరీలకు హాజరు కావడం లేదు. ఎందుకైనా మంచిదని పార్టీ నేతలు డ్వాక్రా మహిళల్ని కూడా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిండుగా కనిపించేందుకు డబ్బులిచ్చి జన సమీకరణ చేస్తున్నారు. అలా వచ్చిన వారు తమకు చెప్పిన సమయం అయిపోగానే వెళ్లిపోతున్నారు. దాదాపుగా ప్రతీ చోటా ఇదే జరుగుతోంది.

పార్టీ క్యాడర్ అసంతృప్తిని ప్లస్ పాయింట్‌గా చెబుతున్న సజ్జల !

అధికార పార్టీ క్యాడర్‌లోనే ఆ పార్టీ కార్యక్రమాలపై ఉత్సాహం లేకుండా పోయింది. ఉంటే ఎంత.. ఊడిత ఎంత అనుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఓ పార్టీ పునాదుల్ని కదిలించే పరిణామం. అయితే వైసీపీని నడిపిస్తున్న వారిలో కీలకమైన వ్యక్తి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఈ విషయాన్ని పాజిటివ్‌గా చెబుతున్నారు. సొంత పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉందంటే.. సీఎం జగన్ ఎంత ఆదర్శవంతమైన పాలన చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఎందుకంటే వారిని దోచుకోవడానికి జగన్ అనుమతించడం లేదని మనం అర్థం చేసుకోవాలి. అంటే.. క్యాడర్‌ను కూడా దోచుకునేవాళ్లలాగా చిత్రీకరించి.. ప్రస్తుత పరిస్థితిని తేలిక చేయాలన్నది ఆయన ఉద్దేశం. కానీ ఆయన తీరు.., పార్టీ హైకమాండ్ వ్యవహరిస్తున్నతీరు క్యాడర్‌లోకి వేరేగా వెళ్తోంది.

వైసీపీ నేతల్లో ఆందోళన !

నగదు బదిలీ పథకాలతో ప్రజలు తమకు పూల బాట పరుస్తారని వైసీపీ నేతలు పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలను ప్రజలు ప్రస్తావిస్తున్నారు. పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలకు కారణం వైసీపీనేనని గట్టిగా నమ్ముతున్నారు. తమ దగ్గర దోపిడీ చేసి ఇతరులకు పంచుతున్నారని మధ్యతరగతి వారు మండిపోతున్నారు. ఇదంతా బహిరంగంగా కనిపిస్తున్న ఫీడ్ బ్యాక్. ఈ విషయంలో వైసీపీ నేతలు నిజం తెలుసుకుంటారో… అదే రకమైన తమ ప్రపంచంలో బతికేస్తారో వేచి చూడాలి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close