ఏపిలో పరిశ్రమల స్థాపనకు చంద్రబాబు కృషి ఫలిస్తుందా?

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నిన్న స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ నగరంలో వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారిలో కొందరు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి అంగీకరింకచడంతో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలించినట్లే ఉన్నాయి.

వాటిలో ఘెర్జి టెక్స్ టైల్స్ సంస్థ రాష్ర్టంలో రూ.2000 కోట్ల పెట్టుబడితో ఒక మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి సంసిద్దత వ్యక్తం చేసింది. మియర్‌ బర్గర్‌ మరియు ఫ్లిసోం అనే సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేసే సంస్థలు రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చెందిన పరిశ్రమలను నెలకొల్పడానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. రాష్ట్రంలో బంగారు శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఇండానీ గ్లోబల్‌ సంస్థ సంసిద్దత వ్యక్తం చేసింది.

ఎథికల్‌ కాఫీ కంపెనీ రాష్ట్రంలో కాఫీ పొడి తయారీ పరిశ్రమను నెలకొల్పడానికి ఆసక్తి చూపింది. అరుకులో కాఫీ తోటలు విస్తారంగా ఉన్నందున ఏపిలో కాఫీ పరిశ్రమ నెలకొల్పడానికి మంచి అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సంస్థ ప్రతినిధులకు తెలిపారు. వారు రాష్ట్రంలో కాఫీ పరిశ్రమను నెలకొల్పడానికి ముందుకు వస్తే అందుకు అవసరమయిన అన్ని అనుమతులను, సౌకర్యాలను సత్వరం కల్పిస్తామని హామీ ఇచ్చేరు.

రాష్ట్రంలో వంట నూనె శుద్ధి పరిశ్రమ, వ్యర్ధ పదార్ధాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమ, జలవిద్యుత్ పరిశ్రమల ఏర్పాటు కోసం సంబంధిత సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. వాటిలో కొన్ని మూడు నాలుగు నెలలలోగా రాష్ట్రంలో సర్వే నిర్వహించి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

ఇటీవల విశాఖలో నిర్వహించిన సి.ఐ.ఐ. భాగస్వామ్య సదస్సులో కూడా దేశవిదేశాలకు చెందిన అనేకమంది పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలలో కనీసం 50 శాతం ఫలించినా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close