బాబుగారూ కోపం వద్దు – ఉత్తరాంధ్ర మొర!

”అభివృద్ధి వేదికలు పెట్టి జనాల్ని రెచ్చగొట్టద్దండీ.. మొన్న అనంతపురం వెళ్లినప్పుడు మీ రాఘవులు రాయలసీమ అభివృద్ధి అంటూ అక్కడి వారందరినీ కూడగట్టి అడిగారు. మీరేమో ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటున్నారు. మొన్న కాపులను రెచ్చగొట్టి పెద్ద రాద్ధాంతం చేశారు” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చికాకుపడ్డారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ నేతృత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నాయకులు ఈమధ్య వినతిపత్రం అందజేసేందుకు వెళ్ళినపుడు జరిగిన సంఘటన ఇది..

”మరే రాష్ట్రానికీ లేని విధంగా మనకే వున్న కొత్త రాష్ట్రం సమస్యల వల్లకూడా మన సిఎం గారి మీద వున్న వత్తిడిని అర్ధం చేసుకోగలం. అయితే సమస్యని వినే ఓపిక లేకపోతే ఎలా? గ్రౌండ్ లెవెల్ లో కష్టాలను అర్ధం చేసుకోకుండా ఏమి అభివృద్ధి చేస్తారు. సమస్యని పట్టించు కోకుండా ప్రయారిటీలుఎలా నిర్ణయిస్తారు ”అని వేదిక సభ్యుడు ఒకరు ప్రశ్నించారు.

వివిధ మానవాభివృద్ధి సూచికలను పరిశీలిస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని రంగాల్లోనూ వెనుకబడి వుంది.రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్‌ 46లో ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, సెక్షన్‌ 94(2)లో మౌలిక వసతుల కల్పన, సెక్షన్‌ 93(13వ షెడ్యూల్‌)లో ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ, ప్రత్యేక రైల్వే జోన్‌ వంటివి పేర్కొన్నారు. అవేవీ అమలు చేయలేదు.

ఆసియాలోనే అత్యాధునికమైనది విశాఖ స్టీల్‌ప్లాంట్‌. రాష్ట్రంలో ఇనుప ఖనిజం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి కానీ విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ఓబులాపురం నుంచి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి అనుమతిచ్చారే కాని ఇక్కడ కేటాయించలేదు. స్టీల్‌ప్లాంట్‌ అసలు కట్టకుండానే బ్రాహ్మణి స్టీల్స్‌కు ఇనుప ఖనిజం గనులు కేటాయించారు. భిలారు, బొకారో, దుర్గాపూర్‌, జంషెడ్‌పూర్‌ స్టీల్‌ ప్లాంట్లకు సొంత గనులున్నాయి. అందువల్ల అక్కడ టన్ను ఖనిజానికి రూ.500 ఖర్చవుతుంటే విశాఖ ఉక్కు ప్లాంట్‌ టన్ను ఖనిజాన్ని రూ.5,000 కొనాల్సి వస్తోంది. కానీ తయారైన ఉక్కును మాత్రం కంపెనీలతో సమానంగా ఒకటే రేటుకు పోటీపడి అమ్మాల్సి వస్తోంది. మరి లాభాలు ఎలా వస్తాయి?

ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం సాగునీటి సౌకర్యాలు లేకపోవడం. పేదరికంతో ప్రజలు పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాల భూమికి రెండు పంటలకు సరిపడా నీరందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలున్నాయి. ఉత్తరాంధ్ర దశనే మార్చేసే ప్రాజెక్టు ఇది. దీనిని నిర్మిస్తే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరువు, వలసలు అనే మాటలే వినబడవు. ఇది పూర్తయితే శ్రీకాకుళంలో 85 లక్షల ఎకరాలకు, విజయనగరం జిల్లాలో 3.95 లక్షలు, విశాఖ పట్నంలో 3.21 లక్షల ఎకరాలకు సాగు నీరందించడంతో పాటు 30 లక్షల జనాభాకు ఉపాధి కల్పిస్తుంది.

అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు దీని ఊసెత్తలేదు. రూ.450 కోట్లుతో తోటపల్లి బ్యారేజీ, రూ.880 కోట్లతో వంశధార ఫేజ్‌-2, రూ.120 కోట్లతో తారకరామతీర్థసాగర్‌, రూ.120 కోట్లతో ఆఫ్‌షోర్‌లను 2003లో తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించి ఇంతవరకూ ఒక్కటీ పూర్తి చేయలేదు. ఉత్తరాంధ్ర నాలుగు ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.1,595 కోట్లు కాగా ఇంతవరకూ ఖర్చు చేసింది రూ.1,300 కోట్లు.

ప్రభుత్వరంగ పరిశ్రమలు బలహీనపడడంతో బాటు బొబ్బిలి, చిట్టివలస, విజయనగరం, నెల్లిమర్లలోని జూట్‌ మిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే మూడు జిల్లాల్లో ఉపాధి కల్పించే 31 చిన్న, పెద్ద పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో వేల సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయారు.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఆరోగ్యంగా ఉన్నవారి కంటే కిడ్నీ సంబంధిత వ్యాధులతో జీవిస్తున్నవారే ఎక్కువ. ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో పరిశీలించేం దుకు నిపుణుల కమిటీ వేసి పరిశీలించింది లేదు. వీరికి పూర్తి స్థాయి వైద్యం మాట పక్కన పెడితే కనీసం డయాలసిస్‌ సెంటర్లు, రక్తం లభ్యమయ్యేలా బ్లడ్‌ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయలేదు. ఆ ప్రాంత ప్రజానీకానికి ప్యూర్‌ వాటర్‌ అందించడానికి కావాల్సిన ఏర్పాటు జరగలేదు.

ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల వైద్యానికి పెద్ద దిక్కుగా ఉన్న కెజిహెచ్‌ని సౌకర్యాల కొరత నేటికీ వెంటాడు తోంది. కార్పొరేట్‌ తరహాలో విశాఖలో విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు. సుమారు పదేళ్లు కావస్తున్నా ఇంతవరకూ దాని ప్రారంభానికి నోచుకోలేదు. విశాఖను ఐటి హబ్‌గా మార్చి ఉత్తరాంధ్రలో సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని అభివృద్ధిచేసి నిరుద్యోగ సమస్యను రూపుమాపుతామని హామీలిచ్చారు. దాన్ని హామీలకే పరిమితం చేశారు.

ఇప్పుడు ఐటి పరిశ్రమకు కేటాయించిన భూములను డీనోటిఫై చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అనుమతులిస్తున్నారు. సుమారు 15 నెలల క్రితం వచ్చిన హుదూద్‌ తుఫాను ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది. అనేక మంది గూడు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యంలో బాధితులం దరికీ రూ.వెయ్యి కోట్లు సహాయం అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా అందింది లేదు. ‘ఎప్పటికైనా సహాయం అందుతుంది.. తాము ఇళ్లు పునర్నిర్మించుకుంటాం’ అనే ఆశతో ఇప్పటికీ అనేక పేద కుటుంబాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

ఉత్తరాంధ్ర పెండింగ్‌ నీటి ప్రాజెక్టులకే రూ.15 వేల కోట్లు అవసరం. ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46లో పేర్కొన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ఇచ్చింది కేవలం జిల్లాకు రూ.50 కోట్లు మాత్రమే. ఈ లెక్కనే నిధులు వస్తే ఉత్తరాంధ్ర ఎప్పటికి కోలుకుంటుంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close