సీఎం జగన్ ఫస్ట్ కేబినెట్ : ఉద్యోగులకు తీపి కబుర్లే.. మిగతా వాటిపై కమిటీలు..!

ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి 27 శాతం పెంచుతూ… ఏపీ ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. దీన్ని 2018 జూలై నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల ఏడాదికి ప్రభుత్వంపై దాదాపుగా 9వేల కోట్ల రూపాయల భారం పడనుంది. నవ్యాంధ్ర రెండో ప్రభుత్వం… తొలి కేబినెట్ భేటీ.. ఐదున్నర గంటల పాటు కొనసాగింది. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజన సంక్షేమశాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు… ప్రస్తుతం ఉన్న గౌరవ వేతనాన్ని రూ. 400 నుంచి 4000 వరకు వేతనాల పెంచాలని నిర్ణయించారు. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ వ్యవస్థ రద్దు కోసం.. ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. న్యాయ సాంకేతిక సమస్యలు రాకుండా సీపీఎస్‌ రద్దును పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

ఉద్యోగులకు పెంచిన పెంచిన ఐఆర్‌ను 2018 జులై నుంచి ఇవ్వనున్నారు. ఐఆర్‌ పెంపుతో రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ. 9వేల కోట్లు భారం పడుతుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్‌ సుముఖత తెలిపింది. ఆర్టీసీ విలీనంపై విధి విధానాల ఖరారుకు కమిటీ వేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ విలీనంపై మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అలాగే అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసా అమలుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా…అంగన్‌వాడీ, హోంగార్డుల జీతాలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. టీడీపీ హయాంలో ఉన్న ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలన్నింటినీ రద్దు చేశారు. పారదర్శకంగా కొత్త ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల జీతం రూ. 18వేలకు పెంచుతూ… నిర్ణయం తీసుకున్నారు. ఇసుక విధానంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. పారదర్శకంగా ఇసుక విధానం ఉండాలని అనుకున్నారు కానీ.. నిర్ణయం తీసుకోలేదు. కుంభకోణాలు వెలికి తీస్తే అధికారులతో పాటు మంత్రులకు సన్మానం చేస్తామని జగన్ కేబినెట్ భేటీలో ఆఫర్ ఇచ్చారు. అవినీతి జోలికి వెళ్లొద్దని మంత్రులను హెచ్చరించారు.

అయితే.. నవరత్నాల్లో కొన్ని అత్యంత కీలకమైన హామీలపై మాత్రం.. ఎలాంటి చర్యలు జరగలేదు. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న దశలో… ఫీజు రీఎంబర్స్ మెంట్ పై క్లారిటీ కోసం.. అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ నిర్ణయం తీసుకోలేదు. అలాగే… స్కూలుకు పిల్లల్ని పంపే తల్లులకు ఏడాదికి రూ. 15వేలు ఇస్తామన్న హామీని జనవరి 26 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు స్కూళ్లు ప్రారంభమయ్యే సీజన్ లో … మాత్రం… ప్రారంభించడం లేదు. అలాగే.. కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు.. రూ. 20వేలు పై ఖర్చులకు ఇస్తామన్నారు. వాటిపైనా నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగులకు సంబంధించి మాత్రం… కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close