ఒకవైపు న్యాయవాదులు..మరోవైపు ఉగ్రవాదులు..

న్యాయమూర్తుల సస్పెన్షన్ తో తెలంగాణా న్యాయవాదుల పోరాటం ఇంకా తీవ్రమైంది. ఇదే సమయంలో హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులని ఎన్.ఐ.ఏ. అధికారులు అరెస్ట్లు చేయడం, వారి నుండి బారీ ప్రేలుడు పదార్ధాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రెండు పరిణామాలు చాలా తీవ్రమైనవే కావడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం ఉదయం గవర్నర్ నరసింహన్ని కలిసి పరిస్థితులని, ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. డిల్లీలో ధర్నా చేయడం గురించి గవర్నర్ కెసిఆర్ ని ప్రశ్నించినట్లు సమాచారం. కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మద్య ఆయన వారధిగా ఉన్నందున ఈ వివరాలన్నీ ఆయన కేంద్రానికి తెలియజేయవచ్చు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి హైదరాబాద్ లో పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతీసారి ఇటువంటి సమావేశాలు, కేంద్రం నుండి ఫోన్ కాల్స్ రావడం సర్వసాధారణమైన విషయమే. కానీ అందరూ కలిసి ఈ సమస్యలని పరిష్కరిస్తారా లేదా? అనేదే చాలా ముఖ్యం.

పాతబస్తీలో ఉగ్రవాదులని కనుగొనడం ఇదే మొదటిసారి కాదు ఆఖరిసారి కూడా కాదనే చెప్పవచ్చు. అయితే ఈసారి ఉగ్రవాదులు హైదరాబాద్ శివార్లలో ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లు కనుగొనడమే చాలా షాకింగ్ న్యూస్! ఆ సంగతి ఎన్.ఐ.ఏ. అధికారులు వచ్చి చెప్పేవరకు హైదరాబాద్ లో పోలీసులకి తెలుసుకోలేకపోయారంటే హైదరాబాద్ ఎంత ప్రమాదంలో ఉందో అర్ధమవుతుంది. ఇంతవరకు 12 చోట్ల సోదాలు జరిపి మొత్తం 11మంది ఐసిస్ సానుభూతిపరులని అరెస్ట్ చేసినట్లు ఎన్‌.ఐ.ఏ. ఐజీ సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. వారందరూ సిరియాలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి నేరుగా వచ్చే ఆదేశాలమేరకే పని చేస్తున్నారని తెలిపారు.

వారి అరెస్టుతో హైదరాబాద్ లో ఒక భారీ విద్వంసం ముప్పు తప్పింది. ఈ సమస్య నివారణకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నిఘా సంస్థలు, రాష్ట్ర పోలీస్ లతో బాటు స్థానిక ప్రజల సహకారం కూడా చాలా అవసరం. అప్పుడే ఈ సమస్య పునరావృతం కాకుండా నివారించవచ్చు. పాతబస్తీపై మంచి పట్టున్న మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో ముఖ్యమంత్రి కెసిఆర్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. కనుక ఈ సమస్యని అరికట్టడానికి ఓవైసీ సహకారం తీసుకొంటే మంచిది.
ఇక తెలంగాణా రాష్ట్ర న్యాయవ్యవస్థలో ఏర్పడిన సంక్షోభాన్ని చల్లార్చేందుకు కేంద్రప్రభుత్వమే చొరవ చూపవలసి ఉంటుంది. న్యాయాధికారుల, ఉద్యోగుల ప్రాధమిక కేటాయింపు, జడ్జీల సస్పెన్షన్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు జోక్యంతో ఉపసంహరింపజేయడం ద్వారా ఈ సమస్యని కొంతవరకు పరిష్కరించవచ్చు. కానీ హైకోర్టు విభజనపై కేంద్రం చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే తప్ప ఆ సమస్య పరిష్కారం కాదు. అది పరిష్కారం కానంతవరకు ఇటువంటి సమస్యలు తరచూ పునరావృతం అవుతూనే ఉంటాయని గ్రహించడం మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close