దుబాయ్‌లో సీఎం రమేష్ హంగామా..!

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు హైదరాబాద్‌లో ఉన్న ఇంటి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అందులో ఉన్న లగ్జరీస్ అలా ఉంటాయి మరి. ఇక నుంచి ఆయన ఇంటి గురించి చెప్పుకోరు. ఆయన కుమారుడి ఎంగేజ్‌మెంట్ ఎలా చేశారో చెప్పుకుంటారు. ఎందుకంటే… ఆ స్థాయిలో చేస్తున్నారు మరి. సీఎం రమేష్ కుమారుడ్ని.. అమెరికాకు చెందిన రాజా తాళ్లూరి అనే ప్రముఖ డాక్టర్ కుమార్తెకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. నిశ్చితార్థాన్ని ఇరవై మూడో తేదీన పెట్టుకున్నారు. హైదరాబాద్‌లోనో… ఢిల్లీలోనో జైపూర్‌లోనో.. ప్రసిద్ధి పొందిన స్టార్ హోటల్స్‌లో .. సంపన్నులు చేస్తూ ఉంటారు. కానీ.. తన గురించి నలుగురు చెప్పుకునేలా చేయాలనుకున్న సీఎం రమేష్. అందుకే… గల్ఫ్ కంట్రీస్‌లో ఒకటైన రస్ అల్ ఖైమాలోని ఉన్న లగ్జరీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు ఈ వేడుక జరగనుంది.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ.. మొత్తంగా 75 మంది ఎంపీలు నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్తున్నారు. కేంద్రమంత్రులు.. ఇతర ఉన్నతాధికారులు.. హై ప్రోఫైల్ మనుషుల సంగతి సరేసరి. ఇక… సీఎం రమేష్ చేసే ఏర్పాట్లతో కాకుండా.. సొంతంగా.. వెళ్లేవాళ్లూ ఉన్నారు. అందరికీ అక్కడ మూడు రోజుల పాటు రాచమర్యాదలు జరుగుతాయి. విమానాశ్రయంలో దిగినప్పటి నుండే.. వారికి మర్యాద రామన్నలు ఎదురొస్తారు. అడిగింది కాదనకుండా.. సమకూరుస్తారు.

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నేతలు దుబాయ్ పయనమవుతున్నారు. అయితే.. నిన్నామొన్నటి వరకూ.. తన బాస్ గా ఉన్న టీడీపీ అధినేతను… ఆ పార్టీలోని ముఖ్యలను ఆహ్వానించారో లేదో కానీ.. భారతీయ జనతా పార్టీకి చెందిన కొంత మంది ప్రముఖులికి మాత్రం ఆహ్వానం అందినట్లుగా చెబుతున్నారు. ఇంతా చేసి.. ఇదంతా నిశ్చితార్థం మాత్రమే. నిశ్చితార్థమే.. ఇంత హంగామా చేస్తూంటే.. పెళ్లి ఇంకెంత హంగామా చేస్తారోనన్న చర్చ సహజంగానే వస్తుంది. పెళ్లి ఎప్పుడు చేస్తారు..? ఎక్కడ చేస్తారు…? అన్న క్లారిటీ వచ్చిన తర్వాత… ఆ విశేషాలు బయటకు రావొచ్చు. అప్పటి వరకూ సీఎం రమేష్ లగ్జరీ నిశ్చితార్థం గురించి చెప్పుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close