సీఎం రమేష్‌తో దీక్ష విరమింప చేసిన చంద్రబాబు..‍! కేంద్రానికి రెండు నెలల గడువు..!!

కడప ఉక్కు పరిశ్రమ కోసం పదకొండు రోజులుగా చేస్తున్న దీక్షను… రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ విరమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. సీఎం రమేష్ చేత దీక్షను విరమింపచేయడానికి కడప వచ్చిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని మెకాన్ సంస్థ నివేదిక ఇచ్చినప్పటికి కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆరు నెలల్లో ప్లాంట్‌ పెట్టాలని చట్టంలో ఉన్నా…ఇంతకాలం కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మెకాన్‌ సంస్థ నివేదిక ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసుల కోసం లాలూచీపడి రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించిన విషయాన్ని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. గండికోటకు నీరు తీసుకొచ్చి ..నీటి కొరత కూడా లేకుండా చేశామన్నారు. 15కి.మీ. దూరంలో హైవే, రైల్వేలైన్‌ ఉందన్నారు. అందరూ సంఘటితంగా ఉంటేనే కేంద్రం దిగి వస్తుందన్న చంద్రబాబు కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీని సాధించి తీరతామని శపథం చేశారు. కేంద్రం పూర్తి స్థాయిలో ప్లాంట్ ను ఏర్పాటు చేయలేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యానికి సిద్ధంగా ఉందని…దానికి కూడా కేంద్రం అంగీకరించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వమే ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతుందని చంద్రబాబు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొంగులేటి సుధాకర్ రెడ్డి.. విభజన హామీలు అమలు కావడం లేదంటూ… సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కేంద్రం కౌంటర్ వేసింది. అందులో తెలంగాణలోని బయ్యారం, ఏపీలోని కడప స్టీల్ ప్లాంట్లు పెట్టడం అసాధ్యమని.. తెలిపింది. దీంతో ఒక్కసారిగా గగ్గోలు రేగింది. తెలంగాణలో రాజకీయ పార్టీలు దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా..ఏపీలో మాత్రం.. అధికార పార్టీ ఉద్యమం ప్రారంభించారు. కడప జిల్లాకు చెందిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణదీక్షకు కూర్చున్నారు. ఏడు రోజులకు ఆరోగ్యం విషమించడంతో బీటెక్ రవిని ఆస్పత్రికి తరలించారు. సీఎం రమేష్‌తో పదకొండు రోజుల తర్వాత ముఖ్యమంత్రి దీక్ష విరమింప చేశారు.

ప్రత్యక్ష ఎన్నికలలో ఇంత వరకూ ఒక్క సారి కూడా పోటీ చేయని సీఎం రమేష్.. ఆమరణ దీక్ష చేసినా.. ప్రజాస్పందన అనూహ్యంగా వచ్చిందని… టీడీపీ వర్గాలు చెబుతున్నారు. కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో.. అదీ సొంత జిల్లాకు కేంద్రం అన్యాయం చేస్తున్నా.. జగన్ నోరు మెదపని అంశాన్ని టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ దీక్ష ఎఫెక్ట్ ను రాజకీయంగా ఉపయోగించేందుకు టీడీపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close