జగన్ కేబినెట్ తొలి ప్రాబబుల్స్ వీళ్లే..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాబై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి నుంచి 25 మందిని మాత్రమే మంత్రులుగా చేయడానికి అవకాసం ఉంది. విధేయులు. తనను వెన్నంటి ఉన్నవారు, పార్టీలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చిన వారు.. అటు తెలంగాణ సీఎం సిఫార్సులు.. ఇటు.. తల్లి విజయమ్మ సిఫార్సులు.. ఇలా అన్నింటినీ కసరత్తు చేసుకుని అందర్నీ సంతృప్తి పరచాల్సిన పరిస్థితి. ఎనిమిదో తేదీన జరగనున్న మంత్రివర్గ విస్తరణ కోసం.. జగన్.. ఓ షార్ట్ లిస్ట్‌ను ఇప్పటికే రెడీ చేసుకున్నారు.

సీనియర్లకు పోటీగా జూనియర్లు కూడా..!

వైసీపీ తరపున ఎమ్మెల్యే లు గా విజయం సాధించిన వారు మంత్రి పదవులపై తమదైన లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు సీనియారిటీ ని నమ్ముకుంటే మరి కొందరు సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు తమకు కలిసివస్తాయని అంచనా వేసుకుంటున్నారు. పార్టీ పట్ల చూపిన విధేయత తమను మంత్రి బెర్త్ కోసం ముందువరుసలో నిలుపుతుందని మరికొందరు చెపుతున్నారు. జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకునే వారంటూ కొంత మంది పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్యనారాయ‌ణ తో పాటు కుర‌పాం ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి రేసులో ముందున్నారని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ లో ఒకరితో పాటు, త‌మ్మినేని సీతారాంలలో ఎవరో ఒకరికి జ‌గ‌న్ ఆవ‌కాశం ఇవనున్నట్లు ప్రచారం జ‌రుగ‌తోంది. ఇక విశాఖ జిల్లాలో ఆవంతి శ్రీనివాస్, ముత్యాల నాయుడు మంత్రి రేసులో వుండే ఆవ‌కాశం వుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గోదావ‌రి జిల్లాలో కాపు, బీసీ, ఎస్సీ వ‌ర్గాల‌కి జ‌గ‌న్ ప్రాదాన్యం ఇవ‌నున్నట్లు చ‌ర్చ జరుగుతోంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపు సామాజిక వ‌ర్గం నుంచి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, క‌న్నబాబుల్లో ఒక‌రికి చోటు ద‌క్కే ఆవ‌కాశం వుంది. బీసీ కోటాలో పిల్లి సుబాస్ చంద్రబోస్, ఎస్సీ కోటాలో విశ్వరూప్ రేసు లొ వుంటార‌ని పార్టీ నేత‌లు ఆంటున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆళ్లనాని లేదంటే గ్రంధి శ్రీనివాస్ కి మంత్రి ప‌ద‌వి ద‌క్కే ఆవ‌కాశం వుంద‌ని ఆంటున్నారు.

సగానికి సగం రెడ్డి సామాజికవర్గం వారేనా..?

కృష్ణా జిల్లాలో కోడాలి నాని పేరు దాదాపుగా ఖరారైందని చెబుతున్నారు. సామినేని ఉదయభాను కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో పనిచేసిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో జగన్ శిష్యుడు, మొదట్నుంచి పార్టీలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవి ఇస్తే పార్థసారథి ఇచ్చే అవకాశంలేదని అంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి ఆళ్ల రామ‌క్రిఫ్ణా రెడ్డి పేరును ఎన్నికలకు ముందే జగన్ ప్రకటించారు. ఆయనకు మంత్రి పదవి దక్కితే ప్రస్తుతానికి ఈ జిల్లా నుంచి మరొకరి పేరు పరిశీలించే అవకాశంలేదు. అయితే ఎస్సీ కోటాలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేరు కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో యువ ఎమ్మెల్యేలు గౌతం రెడ్డి, అనిల్ యాద‌వ్ కి క్యాబినేట్ లొ చోటు ద‌క్కనున్నట్లు పార్టీ నేత‌లు చెబుతున్నారు. చిత్తూర్ జిల్లా నుంచి పార్టీ సీనియ‌ర్ నేత సెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూల్ జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి కి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇవ్వడం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇక ఆనంతపురం నుంచి ఒక బీసీ నేత లేదా ఆనంత వెంక‌ట రామిరెడ్డి కి చోటు ల‌భించే ఆవ‌కాశం వుంది. క‌డ‌ప నుంచి రైల్వే కోడూర్ ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఆంజ‌ద్ బాషా ల‌కు జగన్ అభయం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది

స్పీకర్ పదవి వద్దేవద్దంటున్న సీనియర్లు..!

శాసనసభ స్పీకర్ పదవికి ఆనం రామంనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు పేర్లు పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. బీసీ, ఎస్సీల్లో ఎవరో ఒకర్ని స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే స్పీకర్ పదవికి అనేక మంది విముఖత చూపుతున్నారు. ఆశావహులు చాలా మంది ఉన్నారు. వీరంతా జగన్ ఇంటి చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close