ఎన్నికలంటే ఎంత ఎటకారమైపోయింది సాంబా…..?

రాజకీయాల్లోకి రావాలి, దేశానికి సేవ చేయాలి, భవిష్యత్ తరాలకైనా ఓ మంచి జీవితాన్ని ఇవ్వాలి అని ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన సమాజంలో. సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే రాజకీయాలకు స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళూ ఉన్నారు. అలాంటి వాళ్ళలో మన సాంబడు అలీ కూడా ఒకరు. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పరమ సిల్లీ ఆన్సర్ చెప్పాడు అలీ.

రాజకీయమంటే ఎన్నికల్లో పోటీచేయడం, ఎమ్మెల్యేనో, ఎంపినో అయిపోవడం అన్న గట్టి ఫీలింగ్ మనవాడికి ఉన్నట్టుంది. అందుకే…‘ఇది 2016 వ సంవత్సరమే కదా…2017 ఉంది, 2018 ఉంది, ఆ తర్వాత 2019లో చెప్తాడట. అది కూడా మీడియాతో కాకుండా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి చెప్తాడట. వారెవ్వా….ఏం జెప్పినవ్ సామీ. ఆ బహిరంగ సభలో ‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. ఇప్పుడున్నవాళ్ళందరూ వేస్టు…నేను బెస్టు…నాకు ఓటేసి గెలిపించండి, మీ జీవితాలను ధన్యం చేసుకోండి..’ అని మీరు పిలుపివ్వగానే పోలోమని పోలింగ్ బూతులకు వెళ్ళి ఓట్లు గుద్దెయ్యాలన్నమాట. రాజకీయాల్లోకి వచ్చే విషయం అప్పుడు చెప్తాను అని మీరు మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళలో వెలుగులు, నవ్వులు, ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నా సామి రంగా…… మీరు రాజకీయాల్లోకి రావడమే తెలుగు ఓటర్ల అదృష్టం అన్న గట్టి ఫీలింగ్‌తోనే ఉన్నట్టున్నారు.

అంతే కాదండోయ్….ప్రస్తుతం మాంచి ట్రెండింగ్‌లో ఉన్న పొలిటికల్ ఇష్యూ… ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడేశారు అలీవారు. మాట్లాడడం కాదు ప్రత్యేక హోదా ఎలా తెచ్చుకోవాలో చెప్పేశారు. సున్నితంగా అడిగి తీసుకోవాలట…..ర్యాష్‌గా వెళ్ళకూడదట. ఇక్కడే శ్రీ అలీవారు తన రాజకీయం ఏంటో కూడా రుచి చూపించేశాడు. ఆ మాటలు ఆల్రెడీ ఎవరో చెప్పారట. అలీగారి అభిప్రాయం కూడా అదేనట. అలాగే ఈయనగారి జిగిరీ దోస్త్ పవన్ కళ్యాణ్‌గారి రాజకీయ ప్రవేశం గురించి కూడా మాట్లాడేశారు. ఇప్పుడొక మూడు సినిమాలు చేస్తున్నారట. అవి కంప్లీట్ అయ్యాక…ఎన్నికల సంవత్సరం వచ్చేసరికి ఆయన కూడా రాజకీయరణరంగంలోకి దూకేస్తారట. ఈ మాటలకు కూడా అనుకుంటున్నానన్న వర్డ్‌ని యాడ్ చేశాడు అలీ. రాజకీయం, ఎన్నికలంటే ఎంత ఎటకారమైపోయింది సాంబా……..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close