డైరెక్ట‌ర్ అవుతున్న మ‌రో క‌మెడియ‌న్‌

హాస్య‌న‌టులు ద‌ర్శ‌కులుగా మార‌డం చూస్తూనే ఉన్నాం. ఏవీఎస్‌, ధ‌ర్మ‌వ‌రపు, ఎమ్మెస్ నారాయ‌ణ‌.. ద‌ర్శ‌కులుగా త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేశారు. వెన్నెల కిషోర్ కూడా మెగాఫోన్‌ప‌ట్టిన వాడే. ఇప్పుడు కొత్త‌గా మ‌రో హాస్య‌న‌టుడు కెప్టెన్ కుర్చీలో కూర్చుంటున్నాడు. త‌నే హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌. అమృతం సీరియ‌ల్‌తో పాపుల‌ర్ అయిన హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌.. కొన్ని సినిమాల్లో రాణించాడు. ర‌చ‌య‌త‌గానూ నిరూపించుకొన్నాడు. ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేస్తున్నాడు. రామాయ‌ణం పేరుతో ఓ క‌థ సిద్ధం చేసుకొన్న హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌.. ఓ నిర్మాత‌ని ప‌ట్టేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని టాక్‌.

రామాయ‌ణం అనే పేరున్నా ఇది మైథ‌లాజిక‌ల్ స‌బ్జెక్ట్ కాద‌ని, ఈత‌రం ప్రేమ‌క‌థే అని తెలుస్తోంది. హ్యూమ‌ర్‌, ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో సాగే ఈ సినిమా కోసం ప్ర‌స్తుతం న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకొంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అయితే. ప్రకాష్‌రాజ్ తెలుగు, త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో మ‌న ఊరి రామాయాణం అనే టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల టైటిళ్లు క్లాష్ అయ్యే ప్ర‌మాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close