ఎవరికి వారే… తెలంగాణ కాంగ్రెస్ తీరే : అధిష్టానం ఆగ్రహం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం సీరియస్ అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందనే సంకేతాలు అధిష్టానానికి చేరడంతో స్థానిక నాయకులపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పార్టీని పటిష్ట పరచడంపై శ్రద్ధ చూపించకపోగా ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం పార్టీకి తలనొప్పులుగా మారిందని అధిష్టానం సీనియర్ నాయకుల వద్ద అన్నట్లు సమాచారం. “పార్టీ నియమించిన రాష్ట్ర ఇన్ చార్జిపైనే బహిరంగంగా విమర్శలు చేస్తే ఇక పార్టీపై ప్రజలకు విశ్వాసం ఎలా కలుగుతుందంటూ” సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ తెలంగాణ నాయకుల వద్ద అన్నట్లు సమాచారం. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి ఖుంటియాను నియమించాలని అధిష్టానానికి సూచించింది తానేనని, ఆయనను బహిరంగంగా విమర్శించడమంటే తనను విమర్శించడమేనని గులాం నబీ అజాద్ తెలంగాణ నాయకుల వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరి నియమించాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, ఇది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయమని గుర్తు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడ్ని నియమించే వరకూ ప్రతి ఒక్కరూ ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడి మాటే వినాలని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని కూడా చెప్పినట్లు సమాచారం. అయితే, పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమం చేపడితే ఇతర నాయకులు మద్దతు తెలపాల్పింది పోయి విమర్శలు చేయడం ఏమిటని కాసింత ఘాటుగానే స్పందించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి, వీ. హనుమంతరావు వంటి సీనియర్ నాయకులు ప్రతి రోజూ రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శల కారణంగా కాంగ్రెస్ పార్టీ పరువు బజారున పడుతోందని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీతో సహా సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ ద్రష్టికి తీసుకువెళ్తానని కూడా గులాం నబీ అజాద్ తెలంగాణ నాయకుల వద్ద అన్నట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close