ఆ ఆరింటిపైనే తెలంగాణ కాంగ్రెస్‌కు ఆశలు..!

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. ఓ ఆరు నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. మిగతా వాటిపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. 16 పార్లమెంట్ సీట్ల పై… దృష్టి పెట్టడం కంటే…అవకాశాలు ఉన్న చోట గెలుపుకోసం గట్టిగా కష్టపడటం ఉత్తమం అని భావిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. పార్టీ బలమైన నేతలు అనుకుంటున్న వారిని కొన్ని చోట్ల బరిలోకి దింపింది కూడా అందుకేనని చెబుతున్నారు. భువనగిరి లో కోమటిరెడ్డిని, నల్గొండ ఎంపీ సీటు కి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని బరిలోకి దింపారు. రెండూ సీట్లు కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉన్నవే. ఇద్దరూ రాజీపడబోరని… హైకమాండ్ గట్టిగా నమ్ముతోందంటున్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్ సీటు నుండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ని బరిలో దింపింది.. మల్కాజిగిరి నుండి రేవంత్ కూడా చాలా కాలంగా పోటీ చేయాలని చూస్తున్నారు. స్థానిక పరిస్థితులు కూడా తనకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. అక్కడ రేవంత్ ను బరిలోకి నిలపడం వల్ల ఒక పాజిటివ్ చర్చ మొదలైనట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక చేవెళ్ల లో సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి మళ్ళీ బరిలో ఉన్నారు. స్థానికంగా తనకంటూ ఓ ఇమేజి ఉంది. విశ్వేశ్వరరెడ్డి కి వ్యక్తిగత ఇమేజ్ ఉంది. ఖమ్మం పార్లమెంట్ విషయంలోనూ కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి కాబట్టి.. పార్లమెంట్ సీటు గెలవటం కష్టం ఏమి కాదని కాంగ్రెస్ భావిస్తుంది. ఆదిలాబాద్ సీటు మీద కూడా ఆశలు పెంచుకుంది హస్తం పార్టీ. గతంలో ఇక్కడ ఎంపీ గా గెలిచిన రమేష్ రాథోడ్ ని మళ్ళీ బరిలో నిలిపింది.

ఆరు నియోజకవర్గాల్లో పార్టీ బలం, నేతల వ్యక్తిగత ఇమేజ్ కు తోడు ఇతర రాజకీయ పక్షాల మద్దతు ఉంటే కనీసం ఐదారు స్థానాలు గెలువొచ్చని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అందుకోసం మిత్రపక్షాల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ప్రజాకూటమి కట్టి పోటీ చేశాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. హస్తం పార్టీ ఇప్పటికే ఒక ఖమ్మం మినహా పదహారు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ కూడా కొన్ని చోట్ల పోటీకి రెడి అవుతోంది. అయితే కాంగ్రెస్ దృష్టిపెట్టిన ఆ ఆరు స్థానాల్లో మాత్రం పోటీ చేసే అవకాశం లేదు. ఇక సీపీఐ, టీజేఎస్ కూడా పోటీ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆయా పక్షాల మద్దతుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close