చెట్టు కొట్టి మీదేసుకునే బాపతు కాంగ్రెస్..రాజస్థానే సాక్ష్యం!

ఏదైనా కాంగ్రెస్ పార్టీ సింపుల్‌గా చేద్దామనుకుంటుంది. కానీ చినిగి చేటంతవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒక్కపెద్ద రాష్ట్రం రాజస్తాన్. గతంలోనే సచిన్ పైలట్ తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోతుందన్న పరిస్థితి నుంచి బయటపడింది. కానీ ఇప్పుడు తప్పించుకోలేకపోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబం నుంచి నేత ఎన్నికయ్యేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందులో రాజస్థాన్ సీఎం గెహ్లాత్ పోటీ చేయాలని హైకమాండ్ ఆదేశించింది. ఆయన ఖచ్చితంగా సీఎం పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాల్సి ఉంది.

అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పదవి సచిన్ పైలట్‌కు దక్కుతుంది. కానీ గెహ్లోత్.. ఆయన వర్గం ఎమ్మెల్యేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సచిన్ పైలట్ సీఎం కాకూడదని పట్టుబడుతున్నారు. దాదాపుగా 90 మంది ఎ్మెల్యేలు రాజీనామా చేస్తామని అంటున్నారు. గతంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిన సచిన్ పైలట్ ను సీఎంను చేయడానికి తాము అంగీకరించబోమని వారంటున్నారు. స్పీకర్ గా ఉన్నఎమ్మెల్యేను సీఎంను చేయాలని గెహ్లాద్ ప్రతిపాదిస్తున్నారు.

కానీ సచిన్ పైలట్‌కు ఇవ్వకపోతే ఆయన వర్గం వేరే దారి చూసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ ఇస్తే గెహ్లాత్ వర్గం ఊరుకోదు.కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక ఎలా జరుగుతుందో కానీ అధికారంలో ఉన్న ఓ రాష్ట్ర రాజకీయం సంక్షోభంలో పడిపోయింది. రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ బీజేపీ నేతలు ఇప్పటికే మైండ్ గేమ్ ప్రారంభించారు. గెహ్లాత్ స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయనను అసలు అధ్యక్షుడిగా ఎన్నుకోవద్దు.. అలాగే.. సీఎం పదవి నుంచి తప్పించాలని.. కాంగ్రెస్ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి సింపుల్‌గా చేద్దామనుకున్న ఓ ప్రక్రియ ఇప్పుడు గడ్డు పరిస్థితి తెచ్చి పెట్టింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close