చిరంజీవికి ఐడీ కార్డిచ్చిన కాంగ్రెస్ !

రాజకీయానికి నేను దూరం అయినా రాజకీయాలు మాత్రం తనకు దూరం కాలేదని చిరంజీవి డైలాగ్ చెప్పి ఒక్క రోజు గడవక ముందే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గుర్తింపు కార్డు జారీ అయింది. 2027 వరకూ చెల్లుబాటు అయ్యేలా పీసీసీ డెలిగేట్‌గా కార్డును ఏఐసీసీ జారీ చేసింది. ఈ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంత కాలం క్రియాశీలకంగా ఉన్నప్పటికీ తర్వాత చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. కాంగ్రెస్ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదు.

రాజ్యసభ సభ్యునిగా సమావేశాలకూ వెళ్లలేదు. ఇందు కోసం అప్పట్లో రాజ్యసభ చైర్మన్ అనుమతిని తీసుకున్నారు. పదవి కాలం పూర్తయ్యే రోజు కూడా సభకు వెళ్లలేదు. తాను ప్రత్యక్ష రాజకీయాలను వదిలేశానని ఇటీవలే చిరంజీవి బహిరంగంగా ప్రకటించారు. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ పొలిటికల్ డైలాగ్‌ను వదలడం.. అది వైరల్ అయిన మరుసటి రోజే ఏఐసిసి నుంచి డెలిగేట్ కార్డు మీడియాకు విడుదల కావడం యాధృచ్చికం కాదన్న వాదన వినిపిస్తోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితాను రెడీ చేసింది. ఆ ఓటర్ల జాబితాలో చిరంజీవి కూడా ఉన్నారు. అందుకే కార్డు జారీ అయినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రిగా పని చేశారు. మాజీ ఎంపీలు.. కేంద్రమంత్రులు అందరికీ ఆయా రాష్ట్రాల వారీగా పీసీసీ డెలిగేట్ కార్డులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close