కాంగ్రెస్‌లో ఆపరేషన్ రేవంత్..! వెనుక ఎవరు..?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎంపిక విషయంలో రేస్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇంచార్జి మాణిగం ఠాగూర్ హైదరాబాద్ వచ్చి మూడు రోజుల పాటు పార్టీలోని అన్ని స్థాయిల నుంచి అభిప్రాయసేకరణ జరిపి ఢిల్లీకి వెళ్లారు. అయితే.. తమ వంతు ప్రయత్నాలను ఢిల్లీలోనే చేయాలని పలువురు సీనియర్లు ఢిల్లీ బాట పడుతున్నట్లుగా తెలుస్తోంది. మాణిగం ఠాగూర్ హైదరాబాద్‌లో ఉండగానే… పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డికే ఎక్కువ మంది సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం గాంధీభవన్లో జరిగింది. అయితే రేసులో తాము ముందున్నామంటే.. తాము ముందన్నామని కోమటిరెడ్డి నుంచి జగ్గా రెడ్డి వరకూ అందరూ ప్రకటనలు చేస్తున్నారు.

కొంత మంది ఈ సారి బీసీ పీసీసీ చీఫ్‌ను నియమించాలని కొంత మంది కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ లాంటి వారి పేర్లను వెలుగులోకి తెస్తున్నారు. కొంత మంది నేతలకు కాంగ్రెస్‌లో కీలక స్థానాల్లో ఉన్న వారితో మంచి పరిచయాలు ఉండటంతో వారి ఆశీస్సుల కోసం ఢిల్లీ బాట పడుతున్నట్లుగా తెలుస్తోంది. పదవి కోసం కొంత మంది… పదవి వస్తుందనే వారికి తప్ప ఎవరికైనా ఇవ్వండి అనే వాదనతో మరికొంత మంది ఢిల్లీకి వెళ్లడం కాంగ్రెస్ రాజకీయాల్లో కామన్. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుని ఎంపిక విషయంలోనూ అదే జరుగుతోంది. రేవంత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఢిల్లీలోనూ లాబీయింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. వీరందరి వెనుక ఓ కనిపించని శక్తి ఉందన్న అనుమానం కాంగ్రెస్‌లోనే ఉంది.

పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందు ఉన్నారని ప్రచారం జరుగుతూండటంతో.. పార్టీలో ముందు నుంచి ఉన్న వారికే అవకాశం కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని మైనస్ చేయాలని వారు అనుకుంటున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి మాత్రం.. హైకమాండ్ తనను గుర్తిస్తుందని.. తను ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉన్నారు. ఢిల్లీ వెళ్లాలని కూడా అనుకోవడం లేదు. మరో వారంలో టీ పీసీసీకి కొత్త అధ్యక్షుడ్ని నియమించే అవకాశం ఉంది. అప్పటి వరకూ.. కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close