పద్మావత్ వర్సెస్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్..! బీజేపీ మార్క్ సెన్సార్ ..!

పద్మావతి అనే సినిమా సంజయ్ లీలా భన్సాలీ తీసినప్పుడు… సెన్సార్ బోర్డు ఏమీ అనలేదు. కానీ.. బీజేపీ మద్దతు ఉన్న హిందూత్వ శక్తులు చెలరేగిపోయాయి. భన్సాలీపై దాడి చేశారు. చివరికి సినిమాను నిలిపివేశారు. అంతిమంగా పేరును పద్మావతి నుంచి పద్మావత్‌గా మారిస్తే.. రిలీజ్‌కు అంగీకరించారు. నిజానికి ఆ సినిమాలో ఎలాంటి అభ్యంతరక సన్నివేశాలు.. చరిత్ర వక్రీకరణలు లేవు. ఇంకా చెప్పాలంటే..అది ఓ అభూత కాల్పనిక కథ. మరి అంతగా హిందూ సంస్థలతో సినిమాను సినిమాను చూడకుండా సెన్సార్ చేయించిన బీజేపీ ఇప్పుడేం చేస్తోంది. దేశానికి పదేళ్ల పాటు.. ప్రధానిగా సేవలందించిన ఓ గొప్ప వ్యక్తి… దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఓ గొప్ప ఆర్థిక వేత్తను.. అత్యంత బలహీనడిగా ఓ సినిమా తీసి… తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటోంది. ఎన్నికలకుముందే.. దీన్ని విడుదల చేస్తూ మరింత రచ్చ చేస్తున్నారు. బీజేపీ స్వయంగా.. ఈ సినిమాను ప్రమోట్ చేస్తోంది.

లోక్‌సభ ఎన్నికలకు మూడు నెలలు ముందు రిలీజ్‌ కాబోతున్న “ద యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌”పై వివాదాలు మొదలయ్యాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గా …. అగ్రనటుడు అనుపమ్‌ఖేర్‌ నటిస్తోన్న ఈ సినిమాపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతల్ని అవమానించేలా చిత్రీకరణ ఉందని హస్తం పార్టీ నేతలు ఆందోళనలు మొదలుపెట్టారు. మన్మోహన్‌సింగ్‌ ద యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అనే కవర్‌పేజ్‌తో అప్పట్లో ఓ అమెరికన్‌ పత్రిక ఆర్టికల్‌ను ప్రచురించింది. ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌కు పెద్దగా అధికారాలు లేవని…, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీనే సుప్రీమ్‌ పవర్‌ అనే విధంగా ఆర్టికల్‌ సాగింది. అప్పట్లో దానిపై పెద్ద వివాదమే చెలరేగింది. ఆ తరువాత అదే టైటిల్‌తో మన్మోహన్‌సింగ్‌ దగ్గర మీడియా అడ్వైజర్‌గా పనిచేసిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి సంజయ్‌ బారు పుస్తకం రాశారు. 2004 నుంచి 2008 వరకు ప్రధాని కార్యాలయంలో మన్మోహన్‌ను దగ్గర పనిచేసిన సంజయ్‌ బారు… అనేక కీలక సంఘటనల్లో మన్మోహన్‌ పాత్ర ఎంతవరకు పరిమితం అయ్యింది, పీఎంవోలో సోనియా జోక్యంపై వివరించారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడా పుస్తకమే సినిమాగా తెరకెక్కుతోంది.

మన్మోహన్ సింగ్ ను కీలుబొమ్మను చేసి ఆడించారన్నది ఈ సినిమాలో ప్రధానాంశాం. ఈ సినిమాను బీజేపీ స్వాగతిస్తున్నప్పటికీ ట్రైలర్ చూస్తేనే తమ పార్టీకి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ అంటోంది. ముందు తమకు ప్రదర్శించిన తర్వాతే థియేటర్లలో విడుదల చేయాలని కోరుతోంది. తనకు ఎలాంటి అధికారాలు లేవని తను రాజీనామా చేస్తానని మన్మోహన్ ఒక సందర్భంలో అన్నట్లు కూడా సినిమాలో చూపించబోతున్నారు. అయితే స్కాముల్లో ఇరుక్కున్న ప్రభుత్వాన్ని రాహుల్ నడిపించలేదని, అందుకే మన్మోహన్ కొనసాగాలని సోనియా సూచించారట. .మౌన ముని మన్మోహన్ ఎన్ని సందర్భాల్లో వత్తిడికి లోనయ్యారో ఈ సినిమాలో చెబుతారని బీజేపీ ఎదురుచూస్తోంది. 2019 ఎన్నికల్లో తమ ప్రచారానికి వాడుకోవాలని భావిస్తోంది. ఇదే తరహా సినిమా బీజేపీ ముఖ్యులపై తీస్తే.. ఎలా ఉండేదో..? గోధ్రా ఘటనపై.. సినిమా తీస్తే.. బీజేపీ నేతలు .. కాంగ్రెస్ నేతల్లా.. నోటితోనే అభ్యంతరాలు వ్యక్తం చేసేవారా..? ఇదేనేమో.. దేశంలో ఇప్పుడు ఉన్న సమానత్వం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close