“ఏపీ సీఐడీ”పై కాంగ్రెస్ న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే అదే సమయంలో సీఐడీ అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఇతర పార్టీల నేతల్ని ఎలా వేధించిందో.. ఒక్కొక్క వ్యవహారం బయటకు వస్తోంది. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీని కూడా వదలి పెట్టలేదు. కరోనా సమయంలో…. ఏపీలో వైద్యులకు సరైన పీపీఈ కిట్లు, గ్లౌజులు కూడా ఇవ్వలేదని దుమారం రేగింది. డాక్టర్ సుధాకర్ అంశం హైలెట్ అయినప్పుడు టీవీల్లో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి.. డాక్టర్ కూడా అయిన గాంగాధర్ అనే నేత.. ఓ టీవీచానల్ చర్చలో తన అభిప్రాయాలు చెప్పారు. అయితే.. ఆ ప్రోగ్రాం అయిపోయిన రెండు, మూడు నెలల తర్వాత సీఐడీ ఆయనపై కేసు పెట్టింది. నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన తప్పేమిటంటే.. ప్రభుత్వాన్ని విమర్శించడమట.

గాంగాధర్ పై కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ప్రభుత్వంలోని పెద్దల మెప్పు మేరకు సీఐడీ పోలీసులు చట్టాలను ఉల్లంఘించి వేధింపులకు పాల్పడుతున్నారని.. మండిపడిన ఆ పార్టీ పీసీసీ చీఫ్ శైలజానాథ్.. మొత్తం తీరును వివరిస్తూ.. హైకోర్టుకు లేఖ రాశారు. హైకోర్టు.. మొత్తం వివరాలను తీసుకోవాలని లీగల్ సర్వీసెస్ అధారిటీని ఆదేశించింది. ప్రస్తుతం.. ఈ అంశంలో లీగల్ సర్వీసెస్ అధారిటీ విచారణ జరుపుతోంది. విజయవాడ కాంగ్రెస్‌ ఆఫీసుకు వెళ్లిన లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధులు వారి వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న సమాచారాన్ని కోర్టు ప్రతినిధులకు ఇచ్చారు.

కరోనా సమయంలో వైద్యులకు రక్షణ చర్యలు లేవని చాలా మంది చెప్పారని.. కాంగ్రెస్ నేత గంగాధర్‌ డాక్టర్ హోదాలో తన అభిప్రాయం చెప్పారని శైలజానాథ్ అంటున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని .. ప్రజలు, న్యాయం, ధర్మం కోసం కాంగ్రెస్ ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నిజానికి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే.. కొంత మందిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం ద్వారా మిగతా వారు నోరెత్తకుండా చేయాలనే ప్రణాళికలను రాజకీయంగా చేస్తూ.. సీఐడీని పావుగా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో సీఐడీకి కోర్టు నుంచి చీవాట్లు వస్తున్నాయి. గంగాధర్ పై కేసు విషయంలోనూ సీఐడీకి చిక్కులు తప్పవని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close